చిరు డాడీ ‘బుజ్జిది’ ఇప్పుడెలా ఉందో చూస్తే షాకే

0

మెగాస్టార్ చిరు నటించిన సినిమాల్లో ‘డాడీ’ చిత్రం రూటు సపరేటు. హైలీ ఎమోషనల్ అయిన ఈ సినిమాలో చిన్నారికి తండ్రిగా నటించిన వైనం టచ్ చేయటమే కాదు.. ఈ సినిమా చూసిన వారంతా చిరు కుమార్తె అక్షయగా నటించిన పాప చాలామందిని అలా గుర్తుండిపోయేలా చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా కనెక్టు అయ్యేలా చేసిన ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా వర్క్ ట్ కాలేదు.

వెండితెర మీద కంటే ఈ సినిమా బుల్లితెర మీద బాగానే ఆదరణ పొందినట్లుగా చెబుతారు. ఈ సినిమా చూసిన తర్వాత అక్షయ పాత్ర పాపను అస్సలు మర్చిపోలేని విధంగా తన మాటలతో.. ఎక్స్ ప్రెషన్లతో అదరగొట్టేసింది. చిరు కుమార్తెగా అద్భుతమైన కెమిస్ట్రీతో అందరిని ఆకట్టుకున్నఆ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే. డాడీ చిత్రం విడుదలై రెండు దశాబ్దాలు అవుతున్న వేళ.. ఈ చిన్నారి ఇప్పుడు ట్వంటీ ప్లస్ లోకి రావటమే కాదు.. ఎలా ఉందన్న ఆసక్తి వ్యక్తం కాక మానదు.

ఈ సినిమాలో ఆ చిన్నారికి మంచి పేరు వచ్చినా.. తర్వాత పెద్దగా సినిమాల్లో నటించటలేదు. ఈ ఇరవై ఏళ్లలో ఈ పాప బాగామారిపోవటమే కాదు.. చాలామంది హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందంతో అందరిని ఆకర్షిస్తోంది. అప్పట్లో చిన్న పాప.. ఇప్పుడు యువ కథానాయికి ఏ మాత్రం తీసిపోని ఆ అమ్మాయి పేరు అనుష్క మల్హోత్రా.తాజాగా ఆమె సోషల్ మీడియా పేజీలోని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ పాప ఎలా ఉందో మీరూ ఒక లుక్ వేయండి.