స్వీటీ సినిమా మళ్ళీ వెనక్కి ?

0

రెండేళ్ళయింది అనుష్క సినిమా థియేటర్స్ లోకొచ్చి ఎట్టకేలకు ఓ సినిమా వస్తుందనుకునే లోపే ఆ సినిమా మళ్ళీ వెనక్కి వెళ్తూ ముందుకు రావడం లేదు. హేమంత్ మధుకర్ అనే దర్శకుడితోనే ‘నిశ్శబ్ధం’ అనే థ్రిల్లర్ సినిమా చేసింది అనుష్క. పీపుల్ మీడియా తో కలిసి కోనా ఈ సినిమాను నిర్మించాడు. షూటింగ్ పూర్తవ్వడంతో ఆ మధ్య టీజర్ వదిలారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేలా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకున్నారు.

అన్నీ కుదరడంతో జనవరి 31 న రిలీజ్ అంటూ డిసెంబర్ లో ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసారు. కట్ చేస్తే ఆ డేట్ కి రావడం లేదంటూ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి లో ఓ డేట్ అనుకున్నారు. ఆల్మోస్ట్ ఈ డేట్ కే సినిమా అన్నట్టుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నాడు కోనా. కానీ వ్యవహారం చూస్తే ఆ డేట్ కి కూడా సినిమా వచ్చేలా కనిపించడం లేదు. సినిమాకు సంబంధించి ఇంకా బిజినెస్ క్లోజ్ అవ్వలేదని ఇన్సైడ్ టాక్.

అందుకే ‘నిశ్శబ్దం’ మళ్ళీ ఫిబ్రవరి నుండి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి లో మిస్సయితే స్వీటీ కి ఉన్న ఒకే ఒక్క ఛాయస్ మార్చ్ మాత్రమే ఏప్రిల్ మే లో ఇప్పటికే కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ లాక్ అయ్యాయి. అందువల్ల అనుష్క సినిమాకు ఆ రెండు నెలల్లో థియేటర్స్ దొరకడం కష్టమే. లేదంటే ఏదో ఓ సినిమాతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫైనల్ రిలీజ్ డేట్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.
Please Read Disclaimer