ఫ్లాప్ డైరెక్టర్ కి పడిపోయిన టాప్ హీరోయిన్!

0

అనుష్క 15 ఏళ్ల కెరీర్ ప్రస్తుతం హాట్ టాపిక్. ఈ మంగుళూరు భామ సౌత్ కెరీర్ జర్నీపై ప్రముఖుల ప్రశంసలు తెలిసిందే. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో అనుష్క 15 ఏళ్ల కెరీర్ పైనే ఆసక్తికర చర్చ సాగింది. ప్రత్యేకించి ఒక భారీ ఈవెంట్ ని నిర్వహించి స్వీటీ పై.. రాజమౌళి- కె.రాఘవేంద్రరావు- పూరీ జగన్నాథ్ తదితర సినీ ప్రముఖులు తనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. అనుష్క లెగసీని కొనియాడారు. నటన అంటే ఏంటో తెలియని స్టేజ్ నుంచి దక్షిణాదిలోనే అగ్రహీరోలకు దీటుగా రాణించే స్థాయికి.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్గా నిలిచే స్థాయికి ఎదిగిన వైనం నేటితరం నటీమణులకు ఆదర్శం అంటూ ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం అనుష్క.. లేడీ ఓరియెంటెడ్ చిత్రం `నిశ్శబ్దం’లో నటిస్తుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ సస్పెన్స్ హర్రర్ థ్రిల్లర్ రూపొందుతుంది. మాధవన్- అంజలి- షాలినీ పాండే- సుబ్బరాజు వంటి భారీ తారాగణం నటిస్తుంది. మల్టీ లాంగ్వేజ్ లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. కరోనా ప్రభావంతో వాయిదా పడుతుందా.. లేక యదాతథంగా విడుదలవుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఇదిలా ఉంటే తన పదిహేనేండ్ల జర్నీ పూర్తి చేసుకున్న సంతోషంలో అనుష్క కెరీర్ పరంగా మరింత స్పీడ్ పెంచుతాని తెలిపింది. ఇప్పటికే నెక్ట్స్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆరేళ్ల క్రితం సందీప్ కిషన్- రెజీనా జంటగా నటించిన `రా రా క్రిష్ణయ్య` చిత్రానికి దర్శకత్వం వహించిన మహేష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల అతను అనుష్కని కలిసి స్క్రిప్ట్ చెప్పగా.. దాన్ని డెవలప్ చేయమని.. పక్కా బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చాక సినిమా చేస్తానని హామీ కూడా ఇచ్చిందట. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క మళ్ళీ కెరీర్ డైలమా నుంచి బయటపడుతోంది. అందుకే తనతో సినిమాలు చేసేందుకు అగ్ర దర్శకులు సైతం క్యూలో ఉన్నారు. అయినా స్వీటీ మాత్రం నా రూటే సపరేటు అంటోంది. ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతుండడం ఆమె అభిమానులను షాక్ కి గురిచేస్తుంది. ఓ ఫెయిల్యూర్ డైరెక్టర్ తో సినిమా చేయాల్సిన కర్మ అనుష్కకి ఏంటని ఫైర్ అవుతున్నారు. మరి నిజంగానే అనుష్క ఈ సినిమా చేస్తుందా? లేక అందరు చెప్పినట్టుగానే అతనికి మోహమాటం కొద్ది ఓకే చెప్పిందా అన్నది మరికొన్ని రోజులైతే తెలుస్తుంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-