అటు అనుష్క నిశ్శబ్దం.. ఇటు తేజు పండగ

0

ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు ఫిలిం మేకర్లు తమ సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లతో టీజర్లతో సందడి చేస్తారు. దీపావళి సందర్భంగా ఈరోజు మరోసారి అది రిపీట్ అయింది. ఇటు అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రీ-టీజర్ రిలేజ్ కాగా అటు సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజూ పండగే’ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

‘నిశ్శబ్దం’ విషయానికి వస్తే జస్ట్ 19 సెకన్లు ఉండే ప్రీ టీజర్లో మొదట ఒక దట్టమైన అడవిలో ఉండే ఇంటిని చూపిస్తారు. తర్వాత మాధవన్ వయోలిన్ ప్లే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ షాట్ లో వేళ్ళతో అనుష్క ఒక ముద్రను అభినయిస్తూ ఉంటుంది. స్మశానంలో ఒక పూలతో అలంకరించిన శవపేటిక చుట్టూ నిలుచున్న జనంతో మరో సీన్.. తర్వాత ఒక ఆడిటోరియంలో కరతాళ ధ్వనులు చేస్తుంటారు. ఈ సీన్లకు లింక్ ఏంటి అనేది టీజర్ రిలీజ్ అయితే మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో అనుష్క.. మాధవన్ తో పాటుగా అంజలి.. షాలిని పాండే..మైఖేల్ మ్యాడిసన్.. అవసరాల శ్రీనివాస్.. సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

‘ప్రతిరోజు పండగే’ మోషన్ పోస్టర్ విషయానికి వస్తే సాయి ధరమ్ తేజ్.. రాశి ఖన్నా.. సత్యరాజ్ తో సహా ఈ సినిమాలోని నటీనటులంతా ఒక ఉమ్మడికుటుంబం తరహాలో ఒక ఫ్యామిలీ ఫోటోకు పోజిచ్చారు. అందరూ ఫుల్ సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు. కామెడీ ఎంటర్టైనర్ చిత్రాలకు చిరునామా అయిన మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’ తెరకెక్కుతోంది. జీఎ2 పిక్చర్స్.. యూవీ క్రియేషన్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 20 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer