నిశ్శబ్దం టీజర్ టాక్

0

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క.. మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాలో అంజలి.. షాలిని పాండే.. మైఖేల్ మ్యాడ్సెన్.. సుబ్బరాజు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. టైటిల్ కి తగ్గట్టుగా ఈ సినిమా టీజర్ డైలాగ్స్ విషయంలో నిశ్శబ్దం పాటించారు.

టీజర్ ఓపెన్ చెయ్యగానే అమెరికాలో ఒక టాల్ బిల్డింగ్.. అందులో కిటికీ నుంచి చూస్తున్న ఒక మహిళను లాంగ్ షాట్ లో చూపిస్తారు. నెక్స్ట్ సీన్ లో ఒక వ్యక్తి(మాధవన్ లా ఉన్నాడు) ‘ది మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఇన్ సియాటిల్’ అనే టైటిల్ ఉన్న ఒక ఇంగ్లీష్ బుక్ ను నిర్లక్ష్యంగా నీటిలోకి గిరాటేస్తాడు. మాధవన్ – అనుష్క జంట సియాటిల్ లో ఒక ప్లేస్ కు వెకేషన్ కోసం వెళ్తారు. అదేమో దెయ్యాల కొంప. అక్కడ ఏం జరిగింది.. అనుష్క హాలిడే ట్రిప్ ఏవిధంగా మలుపులు తీసుకుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అనుష్క ఈ సినిమాలో బధిరురాలిగా నటిస్తోంది. దీంతో హాస్పిటల్ లో టెన్షన్ తో బధిరుల భాషలో సైగలు చేసే సీన్లు కొత్తగా ఉన్నాయి. అక్కడ జరిగిన సంఘటనలపై పోలీసు దర్యాప్తు జరుగుతుంది.. అయితే పాత్రధారులు అందరూ అనుమానితులే అన్నట్టుగా చూపించారు.

ఓవరాల్ గా చూస్తే మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీల్ కలుగుతోంది. గోపి సుందర్ నేపథ్యసంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేసేలా ఉంది. హారర్.. థ్రిల్లర్ జోనర్లలో ఉండే ఒక రెగ్యులర్ ఫీల్ కూడా ఉంది. సాధారణ ప్రేక్షకుల సంగతేమో కానీ థ్రిల్లర్ లవర్స్ కు నచ్చేదిగానే ఉంది. ఆలస్యం ఎందుకు.. సైలెంట్ గా చూసేయండి.
Please Read Disclaimer