డేంజరస్ కర్వ్ ఎహెడ్

0

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తన బాయ్ ఫ్రెండ్ ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లితో వివాహం తర్వాత ఎందుకో తన కెరీర్ లో కాస్త స్లో అయింది. పోయినేడాది ‘పరి’.. ‘సంజు’.. ‘సూయి ధాగా’.. ‘జీరో’ చిత్రాలలో నటించిన అనుష్క తన నెక్స్ట్ సినిమాను ఇంకా సైన్ చేయలేదు. రీసెంట్ గా అదే విషయం ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఏదో ఒక సినిమా సైన్ చేయాలని తనకు ఆలోచన లేదని.. మనసుకునచ్చిన కథను ఎంచుకుంటానని తెలిపింది. తన నెక్స్ట్ సినిమా సంగతేమో కానీ తాజాగా ఫిలింఫేర్ కోసం కిరాక్ ఫోటో షూట్ చేసింది.

ఫిలిం ఫేర్ ఆగష్టు 2019 ఎడిషన్లో అనుష్కపై ‘బౌల్డ్ ఓవర్’ అనే కథనం ప్రచురించారు. ఈ కథనంలో అనుష్క తన ప్రేమ.. పెళ్ళి.. ఇతర అంశాలపై వివరంగా మాట్లాడిందట. ఇక కవర్ పేజిపై కూడా ఒక బ్లాక్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది. అయితే మనం ఇప్పుడు ఆ ఫోటో గురించి మాట్లాడుకోవడం లేదు. ఫిలిం ఫేర్ కోసమే మరో డ్రెస్ లో ఓ కత్తిలాంటి పోజిచ్చింది అనుష్క. సహజంగా అనుష్క శర్మ పక్కింటి అమ్మాయిలాగా ఉంటుందని.. నటనలో సూపర్ అయినా.. దీపిక.. ప్రియాంక తరహాలో అల్ట్రా స్టైలిష్ గా ఉండదని కొందరు నెటిజన్ల అభిప్రాయం. వారు కనుక ఈ ఫోటో చూస్తే వెంటనే తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ట్రాన్స్ పరెంట్ గా ఉండే ఒక గ్రీన్ డ్రెస్ లో ఫోటో కోసం పోజిచ్చింది. ఆ డిజైనర్ డ్రెస్ కు వేలాడుతున్న సన్నటి దారాలు ఉన్నాయి.. ఇక బ్యాక్ అంతా ఫుల్ ఓపెన్ కావడంతో అనుష్క వీపు భాగం పర్ఫెక్ట్ షేప్ లో కనిపిస్తోంది. ఆ కర్వ్ చూస్తుంటే “డేంజరస్ కర్వ్ ఎహెడ్” అనే ట్రాఫిక్ సిగ్నల్ గుర్తొస్తోంది.

రెయిలింగ్ కు దగ్గరగా నిలుచున్న అనుష్క ఒక కాలిని రెయిలింగ్ పై పెట్టింది. ఒక చేత్తో దాన్ని పట్టుకుని సైడ్ కు తిరిగి సూపర్ హాట్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఈ ఫోటోను చూసిన తర్వాత ఎవరైనా సరే అనుష్క ఓ పర్ఫెక్ట్ బాలీవుడ్ బ్యూటీ అని ఒప్పుకోవాల్సిందే. అందుకేగా విరాట్ కోహ్లి ఏరికోరి భార్యగా చేసుకుంది.. లేకపోతే ఆయన ఊ అంటే చాలు పెళ్ళికి సై అనే హాటు భామలు ఎంతమంది ఉంటారు? వారందరినీ కాదని అనుష్కనే మనువాడాడుగా!
Please Read Disclaimer