అన్ని రూమర్లకు స్వీటీ అలా చెక్

0

గత కొంతకాలంగా స్వీటీ అనుష్క శెట్టి పై సాగినదంతా ఉత్త ప్రచారమేనా? సోషల్ మీడియా ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదా? అనుష్క ఇంకా సైరా షూటింగ్ లో జాయిన్ కాలేదా? అంటే అవుననేందుకు ప్రూఫ్ దొరికింది. అసలు స్వీటీకి సైరా చిత్రీకరణలో పాల్గొనే ఆస్కారమే లేదు. అయినా రకరకాల రూమర్లు షికారు చేశాయి. సైరాలో అనుష్క పార్ట్ చిత్రీకరించేశారని .. సెట్ లో గాయం అయినా దానిని మౌనంగా భరించేస్తూ షూటింగ్ పూర్తి చేసిందని ప్రచారమైంది. కాలి గాయం నొప్పి పెడుతున్నా ఎలాంటి హడావుడి చేయకుండా స్వీటీ టీమ్ కి సహకరించిందని మీడియాలో కథనాలొచ్చాయి.

కట్ చేస్తే.. అదంతా ఉత్తుత్తేనని ప్రూవ్ చేస్తూ.. అనుష్క స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా రూమర్లకు చెక్ పెట్టేశారు. “నేను బలం(ధిట్టం)గా ఆరోగ్యంగా ఉన్నాను. సీటెల్ లో షూటింగులో పాల్గొంటున్నా“ అంటూ సడెన్ ట్విస్టిచ్చారు. అనుష్క ఇన్ స్టాగ్రమ్ వాల్ పేజ్ పై “ఐ యామ్ హేల్ అండ్ హెల్దీ షూటింగ్ ఇన్ సీటెల్“ అన్న కొటేషన్ కనిపించింది. తాజా క్లారిటీతో ఇప్పటివరకూ తాను సైరా చిత్రీకరణలో పాల్గొనేందుకు అవకాశమే లేదని అర్థమవుతోంది.

అనుష్క ప్రస్తుతం `సైలెన్స్` అనే థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసమే సీటెల్ (యునైటెడ్ స్టేట్స్) వెళ్లారు. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ ఆర్.మాధవన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. భాగమతి తర్వాత స్వీటీ నటిస్తున్న పూర్తి స్థాయి చిత్రమిది. భాగమతి చిత్రీకరణ పూర్తయిన అనంతరం అనుష్క నేచురల్ వేలో బరువు తగ్గేందుకు విదేశాలకు వెళ్లి ట్రీట్ మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. స్వీటీ పూర్తిగా పాత రూపానికి మారిపోయాక సైలెన్స్ చిత్రంలో నటిస్తోంది. మునుపటి అనుష్కను ఈ చిత్రంలో చూడొచ్చని ఇదివరకూ రివీల్ చేసిన ఫోటోషూట్ చెప్పింది.
Please Read Disclaimer