స్వీటీ ఆనందం ఆపై కృతజ్ఞతలు

0

ప్రతిష్టాత్మక ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అనుష్క ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఆ విషయమై చిత్ర యూనిట్ సభ్యులు ఎప్పటికప్పుడు మౌనం వహిస్తూ వచ్చింది. దాంతో సైరాలో అనుష్క ఉందా లేదా అంటూ గందరగోళ పరిస్థితి నెలకొంది. సినిమా విడుదల తర్వాత సైరాలో ఆమె పాత్రపై క్లారిటీ వచ్చేసింది.

సినిమా ఆరంభంలోనే ఆమె జాన్సీ లక్ష్మిగా కనిపించింది. యుద్దంకు భయపడ్డ తన సైనికులకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్ప వీరగాధ చెప్పి వారిలో ధైర్యం కలుగజేస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర అనుష్క పాత్ర వాయిస్ ఓవర్ తోనే ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. సినిమా ఆరంభంలో మరియు ఎడింగ్ లో కొన్ని నిమిషాల పాటు కనిపించిన అనుష్క సినిమాకు తనవంతు ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. తాజాగా సైరాలో తన పాత్ర గురించి అనుష్క స్పందించింది.

సైరా నరసింహారెడ్డి అనే గొప్ప ప్రయాణంలో తాను కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉందని అనుష్క చెప్పుకొచ్చింది. ఈ అద్బుతమైన ప్రయాణంలో తనకు కూడా స్థానం కల్పించినందుకు దర్శకుడు సురేందర్ రెడ్డికి నిర్మాత రామ్ చరణ్ మరియు చిరంజీవిలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. చరిత్రలో కనిపించకుండా పోయిన యోధుడి గురించిన తీసిన సినిమాలో నేను భాగస్వామ్యం అవ్వడం మరిచిపోలేని అనుభూతి అంటూ ఆనందంను వ్యక్తం చేసింది. సినిమాను ఆధరిస్తున్న ప్రేక్షకులకు కూడా అనుష్క కృతజ్ఞతలు చెప్పింది.

సినిమా కోసం చిరంజీవి గారు తన శక్తినంతటిని కూడగట్టి నటించినట్లుగా అనిపించిందని అనుష్క పేర్కొంది. ప్రస్తుతం అనుష్క హీరోయిన్ గా రూపొందుతున్న నిశ్శబ్దం చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. చాలా గ్యాప్ తర్వాత సైరాతో స్క్రీన్ పై కనిపించిన అనుష్క నిశ్శబ్దం చిత్రంతో పూర్తి స్థాయి హీరోయిన్ గా ఎంటర్ టైన్ చేయబోతుంది.
Please Read Disclaimer