అనుష్కతోనే ‘సైరా’ మొదలు !

0

మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా’ లో ఇప్పటికే అరడజను మంది నటీ నటులున్నారు. అందులో బిగ్ బి అమితాబ్ విజయ్ సేతుపతి సుదీప్ కిచ్చా తమన్నా కీలకం. వీరి పాత్రలతోనే కథ ముందుకు సాగుతుందట. అయితే ఇప్పుడీ లిస్టులో అనుష్క పేరు కూడా చేరింది. కాకపోతే అనుష్క జస్ట్ గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తుంది. ఆమె పాత్ర నిడివి తక్కువే అంటున్నారు. కాకపోతే ఆరంభంలో వచ్చే అనుష్క సీన్ సినిమాపై మంచి ఇంపాక్ట్ తీసుకొస్తుందని తెలుస్తుంది.

‘సైరా’లో స్వీటీ ఝాన్సీ లక్ష్మీ భాయ్ క్యారెక్టర్ లో కనిపిస్తుందని సమాచారం. జాన్సీ లక్ష్మీ.భాయ్ డైలాగ్ తోనే సైరా నర్సింహ రెడ్డి క్యారెక్టర్ కి లీడ్ తీసుకొని కథ మొదలవుతుందని టాక్. ఆ సన్నివేశం ప్రేక్షకుడి రోమాలు నిక్కపొడిచేలా తెరకెక్కించారట. ప్రస్తుతం ఐదు దేశాల్లో ‘సైరా’ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతుంది. ఎవరికి వారికి సెపరేట్ చేసి పార్టు పార్టులుగా కంటెంట్ ఇచ్చారు. రిలీజ్ కి తక్కువ సమయం ఉండటం వల్లే ఇలా డివైడ్ చేసుకొని వర్క్ ఫినిష్ చేస్తుంది టీమ్.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది ‘సైరా’. ఆగస్ట్ 20న మెగా స్టార్ జన్మదినం సందర్భంగా బర్త్ డే టీజర్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే బర్త్ డే విషెస్ తో ఓ పోస్టర్ కూడా వదలనున్నారు. అలా మెగా స్టార్ జన్మదినం నుండి ‘సైరా’ మేనియా మొదలవుతుంది. సినిమా ప్రమోషన్స్ ఊపందుకుంటాయి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home