కిలాకిలా నవ్వుతున్న కోహ్లి శ్రీమతి

0

విరాట్ కోహ్లి సతీమణి.. స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉండే హీరోయిన్లలో ఒకరు. అయితే అనుష్క ఈమధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. అనుష్క లాస్ట్ సినిమా షారూఖ్ ఖాన్ తో కలిసి నటించిన ‘జీరో’. ఆ సినిమా తర్వాత అనుష్క నటించే కొత్త సినిమా ప్రకటన ఇంతవరకూ రాలేదు. మంచి స్క్రిప్ట్ కనుక తన దగ్గరకు వస్తే సినిమా చేస్తానని.. సినిమా చేయాలి కదా అని ఏదో ఒకటి చేయాలనే ఆలోచన లేదని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే అనుష్క సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అనుష్క తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు “ఎలాగైనా ఉండగలిగిన ఈ ప్రపంచంలో దయతో ఉండండి. #లవ్ అండ్ లైట్ ప్రాజెక్ట్ @నుష్ బ్రాండ్” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మన సోషల్ మీడియాలో నెగెటివిటి టన్నుల్లో ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే ఆశావహ దృక్పథం ఉండేవారిని ప్రోత్సహిస్తూ పాజిటివిటి పెంపొందించే కార్యక్రమానికి అనుష్క ‘లవ్ అండ్ లైట్ ప్రాజెక్ట్’ పేరుతో శ్రీకారం చుట్టింది. అనుష్క ‘నుష్’ అనే బ్రాండ్ తో దుస్తుల వ్యాపారం కూడా చేస్తుంది. ఆ ‘నుష్’ బ్రాండ్ దుస్తులు ధరించి ఈ ఫోటో షూట్ లో పాల్గొంది.

ఈ ఫొటోలో అనుష్క వైట్ తీ షర్టు – డెనిమ్ మైక్రో ధరించి నవ్వుతూ పోజిచ్చింది. తన వైట్ కలర్ టీ షర్టు పై “బీ కైండ్ హూ ఈజ్ కైండ్” అనే క్యాప్షన్ ఉంది. నేపథ్యంలో సముద్రం ఉండడంతో ఫోటో చాలా అందంగా ఉంది. అనుష్క ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథా’ డైరెక్టర్ శ్రీ నారయణ్ సింగ్ దర్శకత్వంలో ‘జాస్మిన్’ అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ ఉంది.
Please Read Disclaimer