శ్రీమతే..కానీ ఇది హాటు బహుమతి!

0

బాలీవుడ్ బ్యూటీ…కెప్టెన్ విరాట్ కోహ్లి బెటర్ హాఫ్ అనుష్క శర్మ పేరు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. బాలీవుడ్ లో షారూఖ్.. సల్మాన్.. అమీర్ ఖాన్లతో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన ఘనత ఆమె సొంతం. విరాట్ తో వివాహం తర్వాత కూడా నటనను కొనసాగిస్తూ ఈ జెనరేషన్ హీరోయిన్ అనిపించుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా అనుష్క చాలా యాక్టివ్. ఇన్స్టాలో 26 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వారితో నిత్యం టచ్ లో ఉంటుంది.

అయితే అనుష్క శర్మ మాత్రమే కాకుండా అనుష్క ఫ్యాన్స్ మెయిన్టెయిన్ చేసే పేజీలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి ఒక ఫ్యాన్ పేజిలో రీసెంట్ గా అనుష్క ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు. ఒక ఫోటోలో పారదర్శకంగా ఉండే బ్లాక్ – గ్రే కలర్ డ్రెస్ లో తన అందాలను కెమెరాకు ధారపోసింది. ఓ బల్లపై కూర్చొని ఇంటర్నేషనల్ మాడల్ తరహాలో పోజిచ్చింది. ఈ ఫోటోలో మొహంపై పడే జుట్టు అనుష్కకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది.

మరో ఫోటోలో ఫర్ ఉండే కోటు ధరించి.. యధావిధిగా అందాలు వడ్డిస్తూ ఒక పోజిచ్చింది. ఈ ఫోటోలో చేతి మణికట్టుకు ఒక ఆభరణం.. మెడకు ఒక నెక్లెస్ ధరించి డార్క్ లిప్ స్టిక్ తో కాస్త చిందరవందరగా ఉండే జుట్టుతో గ్రీకు దేవతలాగా కనిపిస్తోంది. ఇలాంటి ఫోటోలకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు కదా. అనుష్క సినిమాల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ ‘పరి’.. ‘సంజు’.. ‘సూయి ధాగా’.. ‘జీరో’ రిలీజ్ అయ్యాయి. ‘జీరో’ తర్వాత అనుష్క శర్మ మరో ప్రాజెక్ట్ సైన్ చెయ్యలేదు.
Please Read Disclaimer