పోటీ రిపీట్.. రిజల్ట్ రిపీటవుతుందా?

0

స్వీటీ అనుష్క శెట్టి నటించిన సినిమా రిలీజై ఇప్పటికే చాలా కాలం అవుతోంది. ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నా.. ఆ సమయం మాత్రం రావడం లేదు. ఇంతకీ అనుష్క నటించిన నిశ్శబ్ధం రిలీజ్ ఎప్పుడు? అంటే దానికి తాజాగా క్లారిటీ వచ్చేసింది. నిశ్శబ్ధం చిత్రాన్ని జనవరి 31న రిలీజ్ చేయనున్నారు.

అయితే ఎప్పటిలానే స్వీటీకి మరోసారి తీవ్రమైన కాంపిటీషన్ ఎదురవుతోంది. భాగమతి చిత్రాన్ని 2018 జనవరి 26న రిలీజ్ చేశారు. అయితే భాగమతికి పోటీగా రవితేజ సినిమా రిలీజైంది. సాయి తేజ్- నాగ శౌర్య – వరుణ్ తేజ్ లాంటి హీరోలు నటించిన సినిమాలు ఒకదాని వెంట ఒకటిగా రిలీజయ్యాయి. అయితే అన్నిటినీ నెగ్గుకొచ్చిన భాగమతి స్వీటీకి సంతృప్తికరమైన ఫలితాన్ని ఇచ్చింది.

ఈసారి కూడా నిశ్శబ్ధం కి సేమ్ కాంపిటీషన్ రిపీటవుతోంది. మరోసారి మాస్ మహారాజా రవితేజ అనుష్కకు కాంపిటీషన్ కాబోతున్నాడు. మాస్ రాజా నటించిన డిస్కో రాజా జనవరి చివరిలోనే రిలీజ్ కానుంది. అతడితో పాటు యంగ్ హీరోలు శర్వానంద్ – దేవరకొండ- నితిన్ నటించిన సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఈ పోటీని ఎదురొడ్డి స్వీటీ సినిమా ఎలాంటి ఫలితం అందుకోనుంది? అన్నది సస్పెన్స్. మరోసారి భాగమతి మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ నిశ్శబ్ధం హిట్టవుతుందా? అన్నది చూడాలి. ఈ చిత్రాన్ని కోన వెంకట్- మధు మంతెన బృందం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బహుభాషా చిత్రంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer