అనుష్క ప్రెగ్నెంట్..నెట్టింట వైరల్ అవుతున్న ఫోటో!

0

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట తల్లితండ్రులు కాబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే పిల్లల విషయంలో అనుష్క కొంత సమయం తీసుకుందామని అనుకుందట. కానీ విరాట్ కోహ్లికి పిల్లలంటే ఇష్టం ఉండడంతో ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారట. తాజాగా అనుష్కకి సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోలో అనుష్కని చూసి చాలామంది ఆమె గర్భవతి అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ వర్గాల నుండి కూడా ఈ విషయం పై అవుననే సమాధానాలు వినిపిస్తుండడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ అవుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయం పై విరాట్.. అనుష్క ఇద్దరు స్పందించలేదు.

అయినప్పటికీ సోషల్ మీడియాలో విరుష్క దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అనుష్క గత కొంతకాలంగా సినిమాలకు దూరం కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఆమె ఎందుకు సినిమాల్లో నటించట్లేదన్న ప్రశ్న అందరిని కదిలిస్తుంది. విరాట్ అనుష్కల వివాహం జరిగి మూడేళ్లు గడుస్తుండటంతో ఎప్పుడు శుభవార్త చెప్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మధ్యలో రెండు మూడు సార్లు అనుష్క ప్రెగ్నెంట్ వార్తలు వచ్చినప్పటికీ దానిపై పూర్తి క్లారిటీ రాలేదు. కాగా రీసెంట్గా ఓ మీమ్ క్రియేటర్ అనుష్క బేబి బంప్‌తో ఉన్నట్టు పిక్ ఎడిట్ చేసి షాక్ ఇచ్చాడు. తెలివిగా జెనీలియా ప్రెగ్నెంట్‌తో ఉన్న టైంలో రితేష్‌తో కలిసి ఉన్న ఫోటోను తీసుకొని వాళ్ల ముఖాల స్థానంలో అనుష్కకోహ్లీల ముఖాలు సెట్ చేసాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. కానీ విరుష్క దంపతులు నిజంగా గుడ్ న్యూస్ చెబితే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు.
Please Read Disclaimer