గ్యాప్ తర్వాత జూలు విదిల్చిన అనుష్క

0

2018లో `జీరో` చిత్రంలో నటించింది అనుష్క శర్మ. కింగ్ ఖాన్ షారూక్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల సమయంలో అభిమానులకు అనుష్క టచ్ లో ఉంది. ఆ తర్వాత హబ్బీ విరాట్ కోహ్లీతో విదేశీ విహారాల్లో మునిగి తేలింది. గత కొంతకాలంగా ఎందుకనో అనుష్క ఎంతో స్థబ్ధతతో ఉంది. సౌండ్ అన్నదే లేక పోవడంతో ఏమైంది? అంటూ అభిమానుల్లో ఆరాలు మొదలయ్యాయి.

ఇదిగో ఇంతలోనే ఇలా ప్రఖ్యాత గ్రాజియా మ్యాగజైన్ కవర్ షూట్ తో ప్రత్యక్షమైంది. అనుష్క వెట్ హెయిర్ లుక్ .. క్లాసీ ఎక్స్ పోజింగ్ స్టైల్ కిరాక్ పుట్టించింది. పసుపు వర్ణం మెస్సీ డిజైనర్ వేర్ లో అనుష్క అందం పదింతలైంది. కిల్లింగ్ స్టైల్లో చూపులతో కట్టి పడేస్తోంది. ఆ చేతులకు ఉపయోగించిన యాక్సెసరీస్ అనుష్క లుక్ ని మరింత స్పైసప్ చేశాయి.

అన్నట్టు 2020 గోల్స్ ఏమిటి? అన్నదానికి అనుష్క శర్మ నుంచి సరైన సమాధానం లేదు. ఇంతవరకూ కొత్తగా ఏ సినిమాకి కమిటవ్వలేదు. అంటే ఈ ఏడాది ఏదో సంథింగ్ స్పెషల్ శుభవార్త ఉంటుంది అనే అనుకోవచ్చేమో! విరాట్ ని పెళ్లాడి రెండేళ్లయ్యింది. ఏడాదిన్నరగా సినిమాల్లోనూ నటించలేదు. మరి ఎందుకనో అంత గ్యాప్ తీసుకుంది? అన్నది తనే స్వయంగా చెప్పాల్సి ఉంటుంది.
Please Read Disclaimer