ఇంకా స్వీటీకి అదే చికిత్స?

0

స్వీటీ అనుష్క `నిశ్శబ్ధం` ప్రెస్ మీట్ కి ఎందుకు స్కిప్ కొట్టింది? ప్రస్తుతం అభిమానుల్లో సందేహమిది. అయితే అందుకు ఇదీ కారణం అంటూ ఓ ప్రచారం సాగుతోంది. ఏమిటా ప్రచారం అంటే..?

అందాల అనుష్క శెట్టిపై రూమర్లు ఇప్పటికీ ఆగలేదు ఎందుకనో. సైజ్ జీరో కోసం పెరిగిన బరువు తనను ఇప్పటికీ చిక్కుల్లోకి నెట్టేస్తోందని పదే పదే ప్రచారం సాగింది. అంతేకాదు బరువు తగ్గించుకునేందుకు ఆస్ట్రియా లాంటి చోట్ల నేచురోపతి పద్ధతిలో చికిత్స తీసుకుందని చాలా కాలంగా ప్రచారంలో ఉంది. యోగా గురువుగా తనకు ఉన్న ప్రాక్టీస్ కూడా బరువు పెరగకుండా కాపాడలేకపోవడంతోనే ఇంత సీరియస్ నిర్ణయం తీసుకుందని ఇంతకుముందు మీడియాలో ప్రచారం సాగింది.

అయితే మొన్నటికి మొన్న `నిశ్శబ్ధం` సినిమా ఫస్ట్ లుక్ వచ్చాక.. అలాగే రాజమౌళి తనయుడి పెళ్లిలోనూ అనుష్క కనిపించిన తీరు చూశాక అభిమానులకు షాక్ తగిలింది. స్వీటీ బాగానే బౌన్స్ బ్యాక్ అయ్యింది. విదేశాల్లో బరువు తగ్గే చికిత్స ఫలించింది అంటూ అభిమానులు ఖుషీ అయ్యారు. అయితే ఇదంతా గతం. వర్తమానంలో మరోసారి అనుష్క అదే సమస్యను ఎదుర్కొంటోందా? అంటే అవుననే తెలుస్తోంది.

బరువు సమస్య రిపీటెడ్ గా ఎదుర్కోవడంతో స్వీటీ ఇబ్బంది ఫీలవుతోంది అంటూ ప్రచారమవుతోంది. అంతేకాదు.. మరోసారి ఆస్ట్రియాకి వెళ్లిందని.. నేచురల్ విధానంలోనే బరువు తగ్గే ప్రయత్నం చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రియాలో ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ఈనెల చివరి నాటికి తిరిగి హైదరాబాద్ లో అడుగు పెట్టి `నిశ్శబ్ధం` రిలీజ్ ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అందుకే ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది అంటూ ప్రచారమవుతోంది. అందుకే తాజాగా నిశ్శబ్ధం ప్రమోషనల్ ప్రెస్ మీట్ కి స్కిప్ కొట్టిందిట. బరువు సమస్య వల్లనే అనుష్క మీడియా ముందుకు రాలేదు అంటూ చెబుతున్నారు. అయితే స్వీటీపై ఇలాంటి ప్రచారం పదే పదే జరుగుతుంటే ఇంతకుముందు సీరియస్ అయ్యింది. మళ్లీ అదే ప్రచారం రిపీటైంది కాబట్టి ఈసారైనా మీడియాకి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Please Read Disclaimer