సైరాలో స్వీటీ ఉందన్న చిరు

0

సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లు టీజర్ తో ఊపందుకున్నాయి. ముంబై లో లాంచ్ తర్వాత అక్కడి మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన చిరు చరణ్ లు వాళ్ళతో చాలా విశేషాలే పంచుకున్నారు. వాటి తాలూకు వీడియోలు ఆన్ లైన్ లో రచ్చ చేస్తున్నాయి. అందులోనే అనుష్క ఈ సినిమాలో ఉంటుందన్న సీక్రెట్ ని చిరు స్వయంగా చెప్పేయడంతో సస్పెన్స్ కు తెరపడింది.

నిజానికి ఈ పాత్రను రహస్యంగా ఉంచి రిలీజ్ రోజు సర్ప్రైజ్ ఇవ్వాలని కొణిదెల టీమ్ అనుకున్నట్టుగా గతంలోనే న్యూస్ వచ్చింది. అయితే నిజంగా ఉందా లేదా అనే నిర్ధారణ లేక మీడియా సైతం పుకారుగానే భావించింది. ఇప్పుడు హీరోనే చెప్పడంతో ఇంకెలాంటి అనుమానం అక్కర్లేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర పరిచయం ఝాన్సీ లక్ష్మి బాయ్ ద్వారా జరుగుతుందని ఆ రోల్ అనుష్క అద్భుతంగా పోషించిందని చిరంజీవి చెప్పడం విశేషం. అంటే సినిమా ప్రారంభంలో క్లైమాక్స్ లో తప్ప స్వీటీ కాంబినేషన్ సీన్స్ లో కనిపించే ఛాన్స్ తక్కువే అని చెప్పొచ్చు.

ఇప్పటికే అమితాబ్- సుదీప్- విజయ్ సేతుపతి- నయనతార- తమన్నాల కాంబోతో అవుట్ అండ్ అవుట్ రిచ్ మల్టీ స్టారర్ గా మారిన సైరాలో ఇప్పుడు అనుష్క ఉన్నది కూడా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మరో అదనపు ఆకర్షణ తోడయ్యింది. అక్టోబర్ 2న తెలుగు తమిళ్ హిందీ మలయాళం కన్నడలో భారీ ఎత్తున విడుదల కానున్న సైరా మీద అంచనాలు మాములుగా లేవు. సాహో సెట్ చేసే టార్గెట్స్ ని సైరా క్రాస్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మెగా ఫాన్స్.
Please Read Disclaimer