స్వీటీ అప్పట్లో ఓ స్వీట్ రిలేషన్ లో ఉండేదట!

0

అనుష్క శెట్టి పై లవ్ రూమర్లు.. పెళ్ళి పుకార్లు ఈనాటివి కాదు. అనుష్కను అందరూ స్వీటీ అని పిలుస్తూ ఉంటారు.. వెరీ స్వీట్ అంటూ ఉంటారు కానీ ఈ విషయంలో మాత్రం యమా హాటీనే. ఎప్పుడు తనపై ఇలాంటి గాసిప్పులు వచ్చినా సరే స్వీటీ వెంటనే ‘నో నో నో’ అనేస్తుంది. అయితే ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం అనుష్క ఈ విషయంపై మాట్లాడింది.

“నేను 2008 లో ఒకరితో నాకు బ్యూటిఫుల్ రిలేషన్ ఉండేది. అతనితో ఇప్పటికీ కలిసి ఉంటే మాత్రం పేరు చెప్పేదాన్ని. చాలా పర్సనల్ విషయం కాబట్టి నేను అతని పేరు మాత్రం చెప్పను. ఇప్పటికీ అది గౌరవప్రదమైన రిలేషన్. నేను పెళ్లి చేసుకున్న రోజు అది అందరికీ తెలిసిపోతుంది” అంటూ అసలు విషయం చెప్పకుండా ప్రేక్షకులకు ఓ పజిల్ విసిరింది. అర్థం చేసుకున్నవారికి అర్థం చేసుకున్నంత అర్థం అవుతుంది లేదంటే లేదు. వివాహం చేసుకున్న వెంటనే అతనెవరో అర్థం అవుతుందని ఓ హింట్ ఇచ్చిందంటే ఆ హీరోతో ఇంకా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉన్నట్టే కదా. స్వీటీ మనసులో ఉన్న ఆ నాటీ.. హ్యాండ్సమ్ బాయ్ ఎవరబ్బా?

ఈ చిలిపి సంగతులు పక్కన పెడితే అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ త్వరలో విడుదలకు సిద్ధం కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో మాధవన్.. అంజలి.. షాలిని పాండే.. శ్రీనివాస్ అవసరాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-