స్వీటీ అన్నయ్యలు స్వీట్ గా ఉన్నారే!

0

అనుష్క శెట్టికి సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’తో హిందీ ప్రేక్షకులలో కూడా గుర్తింపు సాధించిన అనుష్క పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా వార్తలు బయటకు రావు. ఒకవేళ ఏదైనా వార్త వస్తే అది ప్రభాస్ తో మ్యారేజ్ అనే రూమర్ తప్ప మరో న్యూస్ ఉండదు. కానీ తాజాగా ఒక ఫోటో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.

అనుష్క నవంబర్ 7 న తన జన్మదిన వేడుకలు జరుపుకుంది. పుట్టిన రోజు సందర్భంగా అటు ఫ్రెండ్స్ ఇటు అభిమానుల నుంచి అభినందనలు అందుకుంది. అయితే తన కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్న జన్మదిన వేడుకల నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటోలో అనుష్క సోదరులు గుణరంజన్ శెట్టి.. సాయి రమేష్ శెట్టి ఇద్దరూ తమ ప్రియమైన సోదరికి ఒకేసారి ప్రేమగా బుగ్గపై ముద్దిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఆ ప్రేమకు థ్రిల్లయిన అనుష్క ఎంతో స్వీట్ గా నవ్వుతోంది. ఈ ఫోటోలో పాండా స్టైల్ లో ఉన్న కేక్ కూడా కనిపిస్తోంది. ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది. అనుష్క లక్కీ అని.. ఇద్దరు సోదరులు తనను ప్రేమగా చూసుకుంటున్నారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

సినిమాల విషయానికి వస్తే అనుష్క ప్రస్తుతం హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ అనే చిత్రంలో నటిస్తోంది. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో మాధవన్. షాలిని పాండే.. మైఖేల్ మాడ్సెన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Please Read Disclaimer