అనుష్క నిశ్శబ్దంగా ఎవరితో టైమ్ స్పెండ్ చేస్తుందో తెలుసా…?

0

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన సెలబ్రిటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంటి పనులు చేసుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోనే ఉంటున్న స్టార్ హీరోయిన్ అనుష్క తన పెట్ డాగ్ తో టైమ్ స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతున్నారు. క్వారంటైన్ టైంలో తనకు తోడుగా ఉన్న పెట్ డాగ్ తో కలసివున్న ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు అనుష్క. మేకప్ లేకుండా చెబ్బీ చీక్స్ తో క్యూట్ స్మైల్ తో బబ్లీగా కనిపిస్తున్న అనుష్క ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక హీరోయిన్స్ అక్కినేని సమంత కీర్తి సురేష్ నిధి అగర్వాల్ చార్మీ వంటి వారితో పాటు మరికొంత మంది సెలబ్రిటీస్ కూడా తమ పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.

కాగా ‘కింగ్’ నాగార్జున నటించిన ‘సూపర్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అనుష్క తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అనిపించుకుంది. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క తన అందం అభినయంతో సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 15 ఏళ్ళ తన సినీ కెరీర్లో తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలందరితో నటించిన స్వీటీ శెట్టి తన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది. ‘అరుంధతి’ ‘పంచాక్షరీ’ ‘భాగమతి’ వంటి లేడీ ఓరియంటెడ్ మూవీల్లో నటించి తాను ఎలాంటి ఛాలెంజింగ్ పాత్ర అయిన చేయగలనని నిరూపించుకుంది. ఈ క్రమంలో అనుష్క ‘దేవసేన’గా నటించిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘నిశ్శబ్ధం’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తమిళ నటుడు మాధవన్ అంజలి షాలిని పాండే మైఖేల్ మ్యాడసన్ సుబ్బరాజు శ్రీనివాస అవసరాల హంటర్ ఓ హరో ముఖ్య పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభోట్ల.. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థియేటర్స్ ఇప్పట్లో రీ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో ‘నిశ్శబ్ధం’ మూవీని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయడానికి చర్చలు జరుపుతున్నారని సమాచారం.
Please Read Disclaimer