పవర్ స్టార్ కోసం అనుష్క!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఛాన్సొస్తే వదులుకుంటారా? ఆయన ఫాలోయింగుకి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. పవన్ సరసన ఛాన్స్ కోసం పలువురు భామలు ఆసక్తి కనబరిచారు. అందులో స్వీటీ అనుష్క కూడా ఒకరు. నటిగా సుదీర్ఘ అనుభవం ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. దాదాపు టాలీవుడ్ హీరోలందరి సరసన నటించింది. కానీ పవర్ స్టార్ సరసన నటించే ఆ ఒక్క ఛాన్స్ మాత్రం దక్కలేదు. చాలా మంది అభిమానులు.. మీడియా పబ్లిగ్గానే పవన్ తో ఎప్పుడు నటిస్తారని అనుష్కను అడిగిన సందర్భాలున్నాయి.

అందుకు ఆమె అంతే తెలివిగా సమాధానం ఇచ్చింది. “ఐయామ్ వెయిటింగ్… ఛాన్స్ రావడం లేదు. నా లైఫ్ లో ఆ వెలితి ఉంది. పవన్ సర్ కి మీరైనా రికమండ్ చేయండి“ అని ఓ ఇంటర్వ్యూలో అంది. అప్పటికే పవన్ పొడి పొడిగా సినిమాలు చేయడం.. రాజకీయంగా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో అనుష్క కు అవకాశం మరింత కఠినమైంది. త్రివిక్రమ్.. డాలీ లాంటి వాళ్లు సినిమాలు చేసినా ఎందుకనో అనుష్కపై ఆసక్తి చూపించలేదు. అప్పటికే అనుష్క పెద్ద స్టార్ గా ఉన్నా అవకాశం రాకపోవడం అనేది ఆశ్చర్యకరమే.

ఇక తాజాగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో పవన్ సరససన నటించే హీరోయిన్ల పేర్లు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. నయనతార- శ్రుతి హాసన్- త్రిష.. ఇలా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. నయన్ పేరు అయితే ఖారారు చేసారనే బలంగా వినిపిస్తోంది. కానీ అనుష్క పేరు కనీసం రూమర్లలో కూడా నిలవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి అనుష్క ప్రయత్న లోపమా? లేక నిజంగా రికమండేషన్ సమస్యనా? అన్నది చూడాలి. ప్రస్తుతం అనష్క నిశ్శబ్ధం అనే కల్ట్ చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మిస్తున్నారు. ఇంగ్లీష్-తెలుగు తమిళ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.