అనుష్క తో సెన్సేషనల్ స్టార్…?

0

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ వస్తున్న ఈ బొమ్మాళీ.. త్వరలోనే టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతోందట. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా ఇటీవలే తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అనుష్క నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోనుంది. ఈ క్రమంలో అనుష్క రెండు న్యూ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసినట్లు సమాచారం.

కాగా అనుష్క ఓ ప్రాజెక్ట్ కోసం విజయ్ దేవరకొండతో కలవనుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. డెబ్యూ డైరెక్టర్ చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన అనుష్క – విజయ్ ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తీస్తున్న విజయ్ దేవరకొండ.. రీసెంటుగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. మరి ఇప్పుడు అనుష్క తో కలిసి చేయాల్సిన ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.