వైజాగ్ టాలీవుడ్ హీట్.. సినిమాటోగ్రఫీ అవంతి కే!

0

ఐదేళ్ల పాలన లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తాత్సారం ప్రస్తుత ముఖ్యమంత్రికి ఊహించనంత స్కోప్ పెంచిన సంగతి తెలిసిందే. అమరావతి రాజధాని స్కెచ్ – రియల్ వెంచర్ల ప్లాన్ .. స్వార్థపూరిత ప్రయోజనాలు బెడిసికొట్టాయి. పర్యవసానం ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నదే. ప్రజల్లో స్పష్టమైన తీర్పు అనంతరం ఏపీ పాలన పైనా.. అభివృద్ది వికేంద్రీకరణ పైనా దృష్టి సారించిన యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వైజాగ్ టాలీవుడ్ పై దృష్టి సారించడం సర్వత్రా ఆసక్తిని పెంచుతోంది. బీచ్ సొగసుల విశాఖ నగరంలోనే రాజధానిని కన్ఫామ్ చేయడం… అన్ని కమిటీల నుంచి విశాఖ రాజధాని కే సానుకూలత వ్యక్తం కావడంతో ఇక ఇతరత్రా ప్రణాళికల పైనా జగన్ దృష్టి సారించారు.

ఇన్నాళ్లు హైదరాబాద్ నుంచి టాలీవుడ్ వైజాగ్ కి వెళుతుందా వెళ్లదా? అన్న డైలమా నెలకొంది. అయితే ఇక ఏమాత్రం ఉపేక్షించేది లేదని యువ ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారని తాజా పరిణామం చెబుతోంది. చంద్రబాబు పాలనలో ఏపీ ఫిలిండెవలప్ మెంట్ (ఏపీఎఫ్ డీసీ) తూతూ మంత్రంగా ఏవో నందులు ప్రకటించినా కానీ ఇప్పటికీ అవి మూలన పడి ఉన్నాయని పరిశ్రమ పెద్దల నుంచే ఆవేదన వ్యక్తమైంది. పరిశ్రమ పై చంద్రబాబు నెగ్లెజెన్సీ పై తీవ్ర అసహనం వ్యక్తమైంది. అయితే ఆ నందులను విశాఖ రాజధాని కేంద్రంగా అవార్డీలకు పంచేందుకు యువ సీఎం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. విశాఖ లోనే ఒక ఘనమైన ఈవెంట్ నిర్వహించడం ద్వారా సరికొత్త టాలీవుడ్ ని వైజాగ్ లో నెలకొల్పాలన్న ధృఢ సంకల్పం జనాల్లోకి వెళ్లేలా చేయాలన్న భావన ఆయన లో కనిపిస్తోంది. మొన్న విశాఖ ఉత్సవ్ లో వైకాపా మంత్రి అవంతి శ్రీనివాస్ వైజాగ్ లో టాలీవుడ్ నెలకొల్పాలన్న సంకల్పాన్ని ప్రకటించడం .. జగన్ మైండ్ లో ఉన్న ఆ ఆలోచనను బయట పెట్టేయడంతో ప్రస్తుతం విశాఖ- ఉత్తరాంధ్ర లో దీని పై విస్త్రతంగ చర్చ సాగుతోంది. ఇదో కొత్త మలుపు… మేలి మలుపు.. ఈ సందర్భం కోసమే యూత్ వేచి చూస్తోందన్న చర్చా వేడెక్కిస్తోంది.

అందుకనుగుణంగానే.. సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి గా అవంతి శ్రీనివాస్ కి బాధ్యతలు అప్పగించేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మా డైరీ ఆవిష్కరణలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. సినీపరిశ్రమ విశాఖకు గ్లామర్ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో పాటే బీచ్ సొగసుల నగరం సరికొత్త సొబగును అద్దుకోబోతోంది. ఇక విశాఖ కేంద్రంగా యువతరానికి ఉపాధి మరింత విస్త్రతమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విశాఖ టాలీవుడ్ పై ఏం చేయాలి.. ఎలా చేయాలి? అన్నదానిపై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించారు. ఆ మేరకు స్పష్టంగా మెగాస్టార్ నోటి నుంచే క్లూ దొరికింది. పరిశ్రమ అవసరాల్ని తన దృష్టికి తీసుకురావాల్సిందిగా వైయస్ జగన్ స్వయంగా అడిగారని చిరునే స్వయంగా అనడంలో అంతరార్థం ఇదే. ఇక స్వతహాగానే సినీపెద్దలంతా చంద్రబాబుకు అనుకూలురు అన్న ముద్ర ఉన్నా.. ఇప్పుడిప్పుడే మబ్బులు విడిపోయే టైమ్ వచ్చిందన్న విస్త్రత చర్చా టాలీవుడ్ లో జరుగుతోంది.
Please Read Disclaimer