మహేష్ ఇంటి ముందు ధర్నా..ప్రభాస్ ఎన్టీఆర్ ల ఇళ్ల ముందు

0

ఏపీ రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన సెగ టాలీవుడ్ స్టార్స్ ను తాకింది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అమరావతికి మద్దతుగా మాట్లాడుకుంటే ఏపీలో వారి సినిమాలను ఆడనిచ్చేది లేదు అంటూ రైతులు ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా హైదరాబాద్ లో టాలీవుడ్ హీరోల ఇళ్ల ముందు ధర్నాలు చేసేందుకు అమరావతి ఆందోళనకారులు సిద్దం అయ్యారు. నేడు మహేష్ బాబు ఇంటి ముందు కొందరు స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు.

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాల్సిందే అంటూ మహేష్ బాబు ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకోవడంతో అక్కడ పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. కేవలం మహేష్ బాబుకు మాత్రమే కాకుండా 19వ తారీకు వరకు వరుసగా హైదరాబాద్ లోని ఫిల్మ్ స్టార్స్ ఇళ్ల ముందు ధర్నాలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు.

10వ తారీకు మహేష్ బాబు ఇంటి ముందు ధర్నా.. 11వ తారీకున అల్లు అర్జున్ ఇంటి ముందు.. 12వ తారీకు చిరంజీవి ఇంటి ముందు.. 13వ తారీకు బాలకృష్ణ.. 14వ తారీకు ఎన్టీఆర్ ఇంటి ముందు.. 15వ తారీకు మోహన్ బాబు ఇంటిముందు.. 16వ తారీకు మా అధ్యక్షుడు నరేష్ ఇంటి ముందు.. 17వ తారీకు ప్రభాస్ ఇంటి ముందు.. 18వ తారీకున నాగార్జున ఇంటి ముందు మరియు 19వ తారీకున వెంకటేష్ ఇంటి ముందు ధర్నాలు చేయబోతున్నట్లుగా విద్యార్థి సంఘం నాయకులు ప్రకటించారు. మరి ఈ విషయమై టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికైనా స్పందిస్తారో చూడాలి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-