ఆమెతో రొమాన్స్ అప్పుడే చేశా కాబట్టి సరిపోయింది.. లేదంటేనా! రొమాంటిక్ ఫొటోలతో హీరో రచ్చ

0

కరోనా ప్రభావంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. గతంలో అయితే కనిపించిన వారందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తూ హగ్గింగులతో విష్ చేసే మనం.. ఇప్పుడు మాత్రం అత్యంత ఆప్తులు, సన్నిహితులు కలిసినా కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేకపోతున్నాం. మనిషి మనిషి మధ్య భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరిగా మారింది. ఇక సినిమా షూటింగ్స్, అందులో రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్ల సంగతుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రస్తుతం షూటింగ్స్ రీ ఓపెన్ అయినప్పటికీ రొమాంటిక్ సీన్ అనగానే జంకి పోతున్నారు హీరోహీరోయిన్లు.

సరిగ్గా ఈ పరిస్థితుల్లో కరోనాకు ముందు చేసిన రొమాంటిక్ సీన్ ఫోటోను, ఒకవేళ అదే సీన్ ఇప్పుడే చేస్తే ఎలా ఉంటుందనే ఫోటోను పోల్చుతూ ఆ రెండు పిక్స్ షేర్ చేసి ఆసక్తి రేకెత్తించారు హీరో అపర్ శక్తి ఖురానా. ప్రస్తుతం ఆయన ‘హెల్మెట్’ అనే మూవీ చేస్తున్నారు. ఇందులో అపర్ శక్తి సరసన ప్రసూతన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కథానుసారంగా ఈ మూవీలో హీరోయిన్ కళ్ళలోకి చూస్తూ హత్తుకునే ఓ సన్నివేశం ఉంది. కరోనా, లాక్‌డౌన్ కంటే ఆ రొమాంటిక్ సీన్ ఫినిష్ చేసింది చిత్రయూనిట్.


అయితే ఆ రొమాంటిక్ సీన్ తాలూకు పిక్ షేర్ చేసిన హీరో అపర్ శక్తి ఖురానా.. ఆ సీన్ కరోనా కంటే ముందే కంప్లీట్ చేసాం కాబట్టి సరిపోయింది లేదంటే ముఖానికి షీల్డ్ పెట్టుకుని ఇలా నటించాల్సి వచ్చేది అంటూ మరో ఫోటో షేర్ చేశారు. దీంతో ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి.. అయ్యో! పాపం, హీరోహీరోయిన్ల రొమాన్స్‌కి గడ్డు రోజులొచ్చాయంటూ వెరైటీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
Please Read Disclaimer