వాల్మీకి టీజర్ పై ప్రశంసలే ప్రశంసలు

0

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ – తమిళ హీరో అథర్వ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాలో వరుణ్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఇప్పటికే వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ కే షాక్ అయిన ప్రేక్షకులు ఈ టీజర్ తో ఫుల్ గా థ్రిల్ అయ్యారు. పలువురు సెలబ్రిటీలు ఈ టీజర్ ను అభినందించడం విశేషం.

అనిల్ రావిపూడి ఈ టీజర్ గురించి “సూపర్బ్ మేకోవర్.. సూపర్బ్ ప్రెజెంటేషన్. వరుణ్ తేజ్.. హరీష్ అన్నగారు మీరు పర్ఫెక్ట్ మాస్ టీమ్” అంటూ ప్రశంసించాడు. మరో దర్శకుడు వెంకీ అట్లూరి “అల్ ది బెస్ట్ వరుణ్ తేజ్.. ఈ లుక్ లో మీరు రాకింగ్. హరీష్ అన్నా నీకు మాస్ పల్స్ తెలుసు” అంటూ ట్వీట్ చేశాడు. కోన వెంకట్ స్పందిస్తూ “హరీష్.. మాస్ క్యారెక్టర్స్ డిజైన్ చెయ్యడంలో నువ్వు మాస్టర్ అని మరోసారి ఋజువు చేశావు. వరుణ్ తేజ్ లుక్.. స్క్రీన్ ప్రెజెన్స్ ప్రతి ఫ్రేం లో సూపర్. టీమ్ అందరికీ అభినందనలు” అంటూ ట్వీట్ చేశాడు. వంశీ పైడిపల్లి ఈ టీజర్ పై స్పందిస్తూ “సూపర్బ్ హరీష్. వరుణ్ తేజ్ లుక్ క్రేజీగా ఉంది. వాల్మీకి టీమ్ కు అల్ ది బెస్ట్”. పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ “వాట్ ఎ ట్రాన్స్ ఫార్మేషన్ వరుణ్ తేజ్.. సుపర్. హరీష్.. మీరు మరోసారి బద్దలు కొడుతున్నారు.. అంతే. మిక్కీ జే మేయర్.. మీరేనా ఈ మ్యూజిక్ అందించింది.. కు కు కుమ్మేశారు” అంటూ ట్వీట్ చేశాడు. మెగా ఫ్యామిలీ మెంబర్స్ సాయి ధరమ్ తేజ్.. నిహారిక కూడా ఈ టీజర్ బాగుందని మెచ్చుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో కూడా వరుణ్ తేజ్ మేకోవర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాస్ చిత్రాలు రూపొందించడంలో సిద్ధహస్తుడైన హరీష్ శంకర్ ఈసారి వరుణ్ తేజ్ ను ఊరమాస్ పాత్రలో చూపించబోతున్నాడని.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Please Read Disclaimer