ఏప్రిల్ లో సినిమా గెలుస్తుందా.. కరోనా గెలుస్తుందా..?

0

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను గడగడలాడిస్తున్న కరోనా కారణంగా మన తెలుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలు వ్యాపారసంస్థలతో పాటు సినిమా షూటింగులు విడుదల కావాల్సిన సినిమాలను కూడా నిలిపేయడం జరిగింది. అయితే ఈ కరోనా ప్రజల ఆరోగ్యాల పైనే కాకుండా సినిమా ఇండస్ట్రీ పై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చ్ 31వరకు విడుదల తేదీలు ప్రకటించిన సినిమాలన్నీ ఇప్పుడు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ ఫస్ట్ నుండి కరోనా ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు కానీ అప్పటికి సరైన మందు దొరకకపోతే మాత్రం ఈ బంద్ పొడిగించే అవకాశం లేకపోలేదు. ఏప్రిల్ నెలలో సినిమా హాళ్ల సందడి మొదలు కానుందని విడుదలకు సిద్ధం చేసిన సినిమాలన్నీ రాబోతున్నాయని సినీ వర్గాలు చర్చిస్తున్నాయి.

అసలు విషయం ఏంటంటే.. ఏప్రిల్ లో విడుదల కావడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. కానీ సినిమా వాళ్లంతా అన్ని పనులు ఆపేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఫ్యామిలీస్ తో బిజీగా గడుపుతున్నారు. మరి మన సినిమా స్టార్లు బయటికి వచ్చేదెప్పుడు.. సినీ ప్రచారాలు సాగించేది ఎప్పుడని అభిమానులలో పెద్ద ప్రశ్నే మిగిలింది. ఒకవేళ ప్రభుత్వాలు ఏప్రిల్ లో కూడా సినిమా హాళ్లు తెరవకపోతే ఏం చేస్తారు? ఈ సమ్మర్ అంతా సినిమాలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్న ప్రేక్షకులంతా ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మాత్రం సినిమాలు విడుదలయ్యేలా కన్పించలేదు. ఎందుకంటే ప్రచారం లేకుండా వస్తే కరోనా ఎఫెక్ట్ తో కనుమరుగైన సినిమాల లిస్టులోకి వెళ్లిపోతాయి. చూడాలి మరి ఏప్రిల్ లో థియేటర్లలో సందడి నెలకొంటుందా.. లేక కరోనా పరిస్థితులు నెలకొంటాయా..? అనేది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-