15 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ తో ఛాన్స్!

0

సూపర్ స్టార్ రజనీకాంత్ కథా నాయకుడి గా సినిమా చేయాలన్నది ఎందరో దర్శకుల కల. కానీ అది వెంటనే నెరవేరుతుందా? అందరిలానే ఏ.ఆర్.మురుగదాస్ కి ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయట. దర్బార్ రిలీజ్ ఇంటర్వ్యూలో ఆయనే ఈ సంగతిని చెప్పారు.

మురుగదాస్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో నా 15ఏళ్ల కెరీర్ పూర్తయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకోకూడదని అనుకున్నా. ఇంతకుముందు రోబో సమయంలోనే ఆయనతో చేయాలని అనుకుంటే కుదర లేదు. ఆ తర్వాత ఎందుకనో ఆలస్యమైంది. ఆయన ఆరోగ్య సమస్య వల్ల వెంటనే చేయ లేకపోయాను. అంతేకాదు.. రజనీ చివరి నిమిషం లోనూ కొన్నిసార్లు స్క్రిప్టు రిజెక్ట్ చేశారు. ఈసారి అలాంటి ఛాన్స్ మిస్సవ్వకూడదని అనుకున్నా. ఓవర్ నైట్ లో 4-5 ఆప్షన్స్ పెట్టుకుని ఆయన కు ఈసారి కథ చెప్పాను. దర్బార్ కథతో ఒప్పించాను“ అని తెలిపారు.

దర్బార్ గురించి మాట్లాడుతూ – “నా కెరీర్ లోనే దర్బార్ చాలా స్పెషల్ మూవీ. ఎందుకంటే నేను 13 సినిమాలు చేసినప్పటికీ రజినీకాంత్ గారితో కలిసి చేసిన తొలి సినిమా ఇది. నేను డైరెక్ట్ చేసిన తొలి పోలీస్ స్టోరీ. అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా చాలా బాగా వచ్చింది. పాన్ ఇండియా సినిమా చేయాలంటే మంచి నిర్మాత కావాలి. సుభాష్ తో నాకు కుదిరింది. ఇందు లో నయనతార- నివేదా థామస్ చక్కగా నటించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి థ్యాంక్స్. చాలా కొత్తగా ఫైట్స్ను కంపోజ్ చేశారు.15 ఏళ్ల క్రితం రజనీకాంత్ గారిని ఎలా చూశారో అదే స్పీడు.. మాస్.. స్టైల్ ఉన్న చిత్రమిది. అనిరుధ్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్.ఆర్ ఇంకా అద్భుతంగా ఇచ్చాడు. సునీల్ శెట్టి.. రజినీకాంత్ గారిని బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని పండించాడు“ అని తెలిపారు.
Please Read Disclaimer