`అదే నా జీవితంలో తీసుకున్న అతి చెత్త నిర్ణయం` : నయనతార

0

స్తుతం స్టార్ హీరోయిన్లుగా మంచి ఫాంలో ఉన్న చాలామంది తారలు కెరీర్‌ స్టార్టింగ్‌లో చిన్న చిన్న పాత్రలు అంతగా ప్రాధాన్యం లేని హీరోయిన్‌ రోల్స్ చేసివారే. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార కూడా కెరీర్‌ స్టార్టింగ్‌లో అలాంటి సినిమాల్లో చేసింది. గతంలో తను పాత్రల ఎంపికలో చేసిన పొరపాట్ల విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది.

ముఖ్యంగా స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌, టాప్‌ హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా గజినిలో నటించటం తన కెరీర్‌లో తీసుకున్న అతి చెత్త నిర్ణయం అంటూ కామెంట్‌ చేసింది నయనతార. అంతేకాదు ఈ సినిమాలో తన పాత్ర ముందుగా చెప్పినట్టుగా తెరకెక్కించలేదని, తన లుక్‌ కూడా అంత బాగోలేదని అభిప్రాయపడింది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ తప్పు పట్టడం లేదని, అలాంటి పాత్ర చేయటం వల్ల తనకు ఓ అనుభవం అయ్యిందటూ క్లారిటీ ఇచ్చింది.
అయితే తాజాగా ఈ విషయంపై డైరెక్టర్‌ మురుగదాస్ స్పందించాడు. తాను ఉద్దేశ పూర్వంగా ఓ ఆర్టిస్ట్‌ను తక్కువ చేయటం, మరో ఆర్టిస్ట్‌కు ఎక్కువ పాత్ర ఇవ్వటం లాంటివి చేయనన్నాడు మురుగదాస్‌. కథ డిమాండ్‌ మేరకు మాత్రమే మార్పులు ఉంటాయని గజిని విషయంలో కూడా అదే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చాడు.

గజిని తరువాత ఇన్నేళ్లకు మురుగదాస్ దర్శకత్వంలో నటించింది నయనతార. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన దర్బార్‌ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో నయన్‌ హీరోయిన్‌గా నటించింది. రజనీ రూత్‌లెస్‌ బ్యాడ్‌ పోలీస్‌గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Please Read Disclaimer