సిల్వర్ స్క్రీన్ కు రెహమాన్ మేనకోడలు

0

సినిమా సంగీతాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ లెవెల్ లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఏఆర్ రెహమాన్ మేనకోడలు వెండితెరకు పరిచయం కాబోతోంది. జివి భవాని శ్రే తన పేరు. మరో విశేషం కూడా ఉందండోయ్. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవి చందర్ కు స్వయానా చెల్లెలు ఈ అమ్మాయి. విజయ్ సేతుపతి నటిస్తున్న కాపే రణసింగంలో భవానికి ఓ కీలక పాత్ర ఆఫర్ చేశారట. అయితే తను హీరోయినా లేక సెకండ్ లీడా అనే వివరాలు మాత్రం తెలియలేదు.

ఐశ్వర్య రాజేష్ కూడా ఇందులో ఉంది కాబట్టి ఆ విషయంలో క్లారిటీ లేదు. ఈ భవానిని నటన కొత్త కాదు. ఇటీవలే నాగార్జున సతీమణి సీనియర్ నటి అమల నటించిన వెబ్ సిరీస్ హై ప్రీస్టెస్ లో ఓ కీలక పాత్ర చేసింది. అది సినిమా కాకపోవడంతో జనానికి అంతగా రీచ్ కాలేదు. ఇప్పుడీ భవాని ఎంట్రీ పట్ల రెహమాన్ రవిచందర్ ఫ్యామిలీస్ బాగా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. స్వరాలకు అంకితం అయిపోయిన తమ కుటుంబం నుంచి ఇలా ఓ అమ్మాయి ఎంట్రీ ఇవ్వడం పట్ల ఆ మాత్రం ఉత్సుకత ఉండటం సహజం.

నిజానికి ఇది గుట్టుగా దాచి పెద్దగా ప్రచారం లేకుండా చేయాలి అనుకున్నప్పటికీ చెన్నై మీడియాలో లీకైపోయి మొత్తం గుప్పుమంది. భవాని లక్షణాలు చూస్తుంటే హీరోయిన్ గా సెటిలయ్యే కళ గ్లామర్ మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి మేనమామ అన్నయ్యల పేరుని నిలబెట్టే బాధ్యతతో పాటు వాళ్ళ అభిమానులు పెట్టుకునే అంచనాలు కూడా అందుకోవాల్సి ఉంటుంది.