రెహమాన్ వారసుడు మెరుపులు

0

స్వరాల పూదోటలో అలుపెరగని యోధుడిగా ఏ.ఆర్.రెహమాన్ సుస్వర సాధన గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఆస్కార్ గ్రహీతగా ఎంతో ఎత్తుకి ఎదిగిన రెహమాన్ స్థాయిని అందుకోవడం వేరొకరి వల్ల ఇప్పట్లో సాధ్యం కానేకాదు. అందుకే ఆయన వారసుడు వస్తున్నాడు అనగానే అంచనాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా రెహమాన్ వారసుడు ఏ.ఆర్ అమీన్ డెబ్యూ గానానికి సంబంధించిన సింగిల్ వీడియో రిలీజైంది. ఈ వీడియో ఆద్యంతం అమీన్ ఎనర్జీ ఆకట్టుకుంది. సాగో పేరుతో రూపొందించిన సింగిల్ లో అమీన్ వోకల్ సామర్థ్యం మైమరిపించింది. వీడియో ఆద్యంతం అమీన్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. అయితే ఈ పాటలో కేవలం వోకల్స్ ని మాత్రమే ప్రదర్శించిన అమీన్ డ్యాన్సులు మాత్రం చేయలేదు. ఈ పాటకు రెహమాన్ స్వయంగా సంగీతం అందించారు. సోనీ మ్యూజిక్ సౌత్ లాంచ్ చేసింది.

అమీన్ ఇదివరకూ మణిరత్నం మూవీ `ఓకే బంగారం`తో సినీఎంట్రీ ఇచ్చాడు. మావులా వా సలీమ్.. అనే పాటతో అతడి సినీ ప్రవేశం జరిగింది. అయితే అతడు భవిష్యత్ లో కేవలం గాయకుడిగానే కొనసాగుతాడా లేక రెహమాన్ మేనల్లుడు జీవీ ప్రకాష్ తరహాలోనే తొలుత గాయకుడు కం సంగీత దర్శకుడిగా రాణించి అటుపై హీరో అవుతాడా? అన్నది మాత్రం చూడాల్సి ఉంది. అమీన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన మరో మూడు మ్యూజిక్ వీడియోల్ని సోనీ రిలీజ్ చేయనుందని తెలుస్తోంది.
Please Read Disclaimer