బాలీవుడ్ పై ఏఆర్ రహమాన్ సంచలన వ్యాఖ్యలు

0

సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ లో పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవని తేలిపోయింది. సినీ ప్రముఖులు కూడా కొందరు బాలీవుడ్ లో ఉన్న పెద్ద వారిపై ఆగ్రహంతో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం వల్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పది ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇబ్బందులు తప్పడం లేదని కొందరు స్టార్స్ వాపోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో అడుగు పెట్టిన వారికి తిప్పలే అంటూ ఆరోపణలు వినిపిస్తున్న ఈ సమయంలో ఆస్కార్ అవార్డు గ్రహీత సౌత్ స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ బాలీవుడ్ పై సంచలన ఆరోపణలు చేశారు.

రహమాన్ తాజాగా ‘దిల్ బేచారా’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఒక రేడియో కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బాలీవుడ్ నుండి నన్ను తప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆఫర్లు నా వరకు రాకుండా కుట్ర చేస్తున్నారు. సమయంకు ట్యూన్స్ ఇవ్వను అని ఇంకా కొన్ని పుకార్లు నా గురించి ప్రచారం చేసి నాకు బాలీవుడ్ ఆఫర్లు తగ్గేలా చేశారు. చాలా వరకు సినిమాలు నా వరకు రాకుండా మద్యలో కొందరు అడ్డుగా నిలబడ్డారు. దిల్ బేచారా చిత్ర దర్శకుడు కూడా ఈ విషయాన్ని నిర్థారించాడు.

దిల్ బేచారా దర్శకుడు ముఖేష్ చబ్రా మాట్లాడుతూ తాను ఈ సినిమాకు రహమాన్ ను సంగీత దర్శకుడిగా అనుకున్న సమయంలో ఆయన గురించి పలువురు చెడుగా చెప్పారు. సమయంకు సినిమా విడుదల అవ్వాలంటే రహమాన్ తో కాకుండా మరో దర్శకుడితో వర్క్ చేయాలంటూ సూచించారు. కాని నేను మాత్రం రహమాన్ పై నమ్మకంతో ఆయనతో ఈ సినిమాను చేశానన్నాడు. నటీనటులు మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సంగీత దర్శకుడు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అంటే బాలీవుడ్ లో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.Please Read Disclaimer