అరణ్య టీజర్: జంగిల్ కింగ్ బల్ దేవ్ వార్

0

రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `హాథీ మేరే సాథీ`. ఇది హిందీ వెర్షన్ టైటిల్. తెలుగులో అరణ్య.. తమిళంలో `కదన్` పేరుతో రిలీజవుతోంది. అరణ్యంలో జంతువులకు రక్షకుడిగా రానా నటిస్తున్నారు. గజరాజు (కుంకీ) ఫేం ప్రభు సోల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2020 పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.

ఇటీవలే రానా కొత్త లుక్ రిలీజైంది. గుబురు గడ్డం.. మాసిన దుస్తుల్లో రానా లుక్ పూర్తి మాసీగా కనిపించింది. అతడి పాత్రలో శివపుత్రుడు షేడ్స్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. తాజాగా అరణ్య టీజర్ రిలీజైంది. ఈ టీజర్ లో రానా ఆహార్యం జంతు ప్రేమికుడిగా.. మూగజీవాల రక్షకుడిగా అతడి విన్యాసాలు అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. అడవిలో పక్షలు జంతుజాలానికి అర్థమయ్యే భాషలో రానా పిలుపు.. అమాయకత్వం మొరటుదనం కలబోసిన ఆ ఎక్స్ ప్రెషన్ ప్రత్యేకంగా ఆకర్షించింది.

రొటీనిటీకి భిన్నమైన పాత్రను ఎంచుకుని రానా ఈసారి భారీ సాహసమే చేస్తున్నాడు. ఇక అతడి మాసిన జుత్తు.. ముఖంపై గాటు చూస్తుంటే అడవిలో భీకర పోరాటాలే చేస్తాడని అర్థమవుతోంది. పచ్చని అడవిలో ఏనుగులు.. పులులు.. ఇతర జంతుజాలాన్ని.. సేమ్ టైమ్ ఎండుటడవిని కూడా టీజర్ లో చూపించారు. ఇక ఇందులో .. “నువ్వు ఎవరు?“ అని ప్రశ్నిస్తుంటే.. బల్ దేవ్ అంటూ రానా సమాధానం ఇస్తున్నాడు. అడవిలో జంతువుల్ని సంహరించేవాళ్లతో బల్ దేవ్ పోరాటం తెరపై చూడబోతున్నామని అర్థమవుతోంది. ఇక అడవి అంటే జంతు జాలంతో పాటు నక్సల్స్ కూడా ఉంటారు కదా! కీకారణ్యంలో తుపాకుల హోరును ఇందులో చూపించారు. సైలెంటుగా ఉండే అడవుల్లో పక్షుల కిలకిలారావాన్ని.. పండోరా అందాల్ని ఈ సినిమాలో చూసే భాగ్యం కలగబోతోందని టీజర్ క్లూ ఇచ్చింది. రానాతో పాటు.. ఈ చిత్రంలో పులకిత్ సామ్రాట్- శ్రీయా-జోయా తదితరులు నటించారు. ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Please Read Disclaimer