అరవింద సమేత రెండ్రోజుల షేర్

0

అరవింద సమేత- వీర రాఘవ ఎన్టీఆర్ కెరీర్ క్లీన్ బ్లాక్బస్టర్గా డిక్లేర్ అయ్యిందా? అంటే అవుననే బాక్సాఫీస్ లెక్కలు చెబుతున్నాయి. ఈ సినిమా కేవలం రెండ్రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ నుంచి మరో 7.5కోట్లు రాబట్టింది. అంటే వరల్డ్వైడ్ 40 కోట్లు పైగానే షేర్ కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 27కోట్లు రెండో రోజు 8కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్7.5కోట్లుగా వసూళ్ల లెక్క తేలింది. అంటే గ్రాస్ సుమారు 60కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నాన్ బాహుబలి కేటగిరీలో రికార్డు అందుకున్న `అరవింద సమేత` మునుముందు దసరా సెలవుల్ని పురస్కరించుకుని వసూళ్లు పుంజుకుంటుందనే అంచనా వేస్తున్నారు. తద్వారా మరిన్ని రికార్డుల్ని క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికైతే ఏపీ తెలంగాణలో బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు తెస్తోంది. ఇరు రాష్ట్రాల్లో రెండ్రోజుల షేర్ వివరాలు పరిశీలిస్తే..

మొదటి రోజు షేర్ వసూళ్ల వివరాలు ఏరియా వైజ్ పరిశీలిస్తే… నైజాం-2.83కోట్లు – సీడెడ్ -1.96కోట్లు – నెల్లూరు -0.27కోట్లు – ఉత్తరాంధ్ర-0.88కోట్లు – తూ.గో-0.47కోట్లు – ప.గో-0.32కోట్లు – కృష్ణ-0.54కోట్లు – గుంటూరు-0.67కోట్లు వసూలైంది. ఏపీ-తెలంగాణ కలుపుకుని రెండోరోజు – 7.95కోట్ల గ్రాస్ వసూలైంది. రెండో రోజు షేర్ పరిశీలిస్తే.. నైజాం-8.55కోట్లు – సీడెడ్- 7.44కోట్లు – నెల్లూరు-1.33కోట్లు – గుంటూరు – 4.82కోట్లు – తూ.గో-3.24కోట్లు – ఉత్తరాంధ్ర -4.01కోట్లు – ప.గో-2.69కోట్లు – కృష్ణ-2.51కోట్లు – ఏపీ-తెలంగాణ కలుపుకుని రెండ్రోజులకు 34.59కోట్లు వసూలైంది.