అమెరికా ప్రీమియర్లలో అరవింద జోరు

0

అగ్నికి ఆజ్యం తోడైతే ఎలా ఉంటాది? నిప్పుకు నెయ్యి తోడైతే ఎలా ఉంటాది? ఫైరుకు ఘీ తోడైతే ఎలా ఉంటాది? ఇంకెలా ఉంటాది.. అమెరికాలో ‘అరవింద సమేత వీర రాఘవ’ ప్రిమియర్ కలెక్షన్ల లాగ ఉంటాది!! ఈమధ్య అసలే ఎన్టీఆర్ కు ఓవర్సీస్ లో ఫాలోయింగ్ పెరిగింది. పైగా త్రివిక్రమ్ ను అభిమానించే క్రౌడ్ ట్రంపు రాజ్యలో ఎక్కువే. ఇద్దరూ కలసి ‘అరవింద సమేత’ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఓవర్సీస్ ఆడియన్స్ లో భారీ ఆసక్తి వ్యక్తం అయింది. అదే ‘అరవింద సమేత’ బుధవారం ప్రీమియర్స్ కలెక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయింది.

బుధవారం నాడు 225 లోకేషన్స్ నుండి $797366 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో పాటుగా మరి కొన్ని స్క్రీన్స్ నుండి కలెక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. ఈలెక్కన ప్రీమియర్స్ ద్వారానే $800k క్లబ్ లో కి ఎంటర్ అవుతుంది. సినిమాకు ఎలాగూ పాజిటివ్ రివ్యూస్.. మంచి టాక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రీమియర్స్ లో చరణ్ ‘రంగస్థలం’ సినిమా కలెక్షన్స్ $725k ను తారక్ దాటేశాడు. దీంతో ఎన్టీఆర్ సినిమా అమెరికాలో అల్ టైమ్ టాలీవుడ్ హయ్యెస్ట్ ప్రీమియర్ గ్రాసర్స్ లిస్టు లో ఏడవ స్థానం లో నిలిచింది.

ఇక ‘అరవింద సమేత’ కంటే ముందున్న మహేష్ బాబు చిత్రం ‘భరత్ అనే నేను’ ప్రీమియర్స్ కలెక్షన్స్ లో ($850k) దాటగలడా లేదా వేచి చూడాలి. ఈ విషయం తేలాలంటే ప్రీమియర్స్ కలెక్షన్స్ ఫైనల్ ఫిగర్స్ రావాలి. ఏదేమైనా యంగ్ టైగర్ చిత్రానికి ఇది సాలిడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు.
Please Read Disclaimer