పెళ్లి తర్వాత తెలుగమ్మాయ్ ఇలా

0

అందాల కథానాయిక అర్చన బిగ్ బాస్ సీజన్ 1లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో నటించిందేమీ లేదు. ఇటీవలే పారిశ్రామిక వేత్త జగదీష్ ని ప్రేమించి పెళ్లాడింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గచ్చిబౌలిలోని కొల్లమాధవరెడ్డి గార్డెన్ లో జరగనున్న ఈ వేడుకకు భారీగా బంధుమిత్రులు సహా పలువురు సినీసెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ పెళ్లి కుదరడం వెనక స్నేహితులైన శివబాలాజీ-మధుమిత దంపతులు వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

గతం గతః అనుకుంటే.. వర్తమానంలో అర్చన ఏం చేయబోతోంది? తిరిగి సినిమాల్లోకి వస్తోందా? అంటూ అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక ఇప్పటికి అయితే తను హనీమూన్ పేరుతో ఎగ్జోటిక్ లొకేషన్ కి వెళ్లిపోయిందని చెబుతున్నారు.

ఈ సందడి కాస్తా అయిపోతే తిరిగి తాను నటన గురించి ఆలోచించేంత స్కోప్ ఉంటుందని భావించవచ్చు. తాజాగా అర్చన లేటెస్ట్ ఫోటోషూట్ ఒకటి వైరల్ గా మారింది. తెలుగమ్మాయ్ ఈ డిజైనర్ లుక్ లో ఎంతో స్పెషల్ గా కనిపిస్తోంది. ఎప్పటిలానే తాను పెళ్లి తర్వాత కూడా అంతే అల్ట్రా మోడ్రన్ గా లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయబోతోందనడానికి ఈ ఫోటోనే ఎగ్జాంపుల్. తిరిగి సినిమాల్లో నటిస్తుందా లేదా? తన హబ్బీ అందుకు అంగీకరించారా లేదా? అన్నది తనే చెప్పాల్సి ఉంది.
Please Read Disclaimer