నిర్మాతల్ని హీరోలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

0

అంతర్జాతీయంగా పాపులరైన విదేశీ కార్పొరెట్ దిగ్గజాలతో పోటీపడలేక లోకల్ ఓటీటీలు చతికిల బడుతున్న సంగతి తెలిసిందే. కార్పొరెట్ ఓటీటీలు ఇచ్చే ప్రైజ్ తో పోలిస్తే లోకల్ వాళ్లు అంత ఇచ్చుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఇక ఇదే అదనుగా అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు నిర్మాతల్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నాయట. పర్యవసానంగా హీరోలు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయి చివరికి ఓటీటీ రిలీజ్ చేస్తే ఇకపై రిలేష్ కట్ అంటూ నిర్మాతల్ని బ్లాక్ మెయిట్ చేయాల్సిన పరిస్థితి దాపురించిందని తెలుస్తోంది.

అసలు తెలుగు సినిమాలను కొనే ఓటీటీలు ఎన్ని ఉన్నాయి? అన్నది లెక్క చూస్తే.. అమెజాన్ ప్రైమ్- నెట్ ఫ్లిక్స్- సన్ నెక్ట్స్- జీ5- ఆహా- హాట్ స్టార్…! వంటి సంస్థలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో అమెజాన్ ప్రైమ్ వాళ్లు మాత్రమే ప్రస్తుతం డైరెక్ట్ టు ఓటిటి రిలీజ్ లు అంటూ తెలుగు సినిమా నిర్మాతలపై ప్రెజర్ పెడుతున్నారు. అందు కోసం మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఆహా వారు కూడా అమెజాన్ ప్రైమ్ మాదిరిగానే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ స్లాట్ ఒకటి ఓపెన్ చేశారు. కానీ పెద్దగా నిర్మాతలు ఆహా వైపు దృష్టి పెట్టడం లేదు. పెట్టినా ఏదో థియేటర్ రిలీజ్ కు నోచుకొని సినిమాలే ఆహా వైపు చూస్తున్నాయి.

ఇక అమెజాన్ ప్రైమ్ ఇప్పటి వరకు అచ్చమైన తెలుగు సినిమాను తన ఫ్లాట్ ఫామ్ లో డైరెక్ట్ రిలీజ్ చేయ లేదు. మొన్న వచ్చిన పెంగ్విన్ కూడా డబ్బింగ్ సినిమానే. అయితే అమెజాన్ వారు చెబుతున్న ప్రకారం చాలా మంది తెలుగు అగ్ర నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లకు సిద్ధమైనప్పటికీ హీరోల కారణం గానే వెనకంజ వేస్తున్నారని తెలిసింది. ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ వల్ల హీరోలు తమ మార్కెట్ దెబ్బ తింటుందని.. ఇలా చేస్తే తమతో రిలేషన్ ఇక వదలుకోవాల్సిందే అని బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నారని తెలిసింది.

అంతేకాదు చాలా మంది నిర్మాతలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయక పోవడానికి కారణం.. తెలుగు సినిమా అగ్ర హారోల్లో దాదాపు అందరూ నిర్మాతల దగ్గర నుంచి నాన్ థియేట్రికల్ రైట్స్ రాయించేసుకున్నారు. నిర్మాతలు ఒక వేళ ఇలా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లు చేస్తే ఎంతోస్తే అంత హీరోగారికి ఇవ్వాల్సిందే. అందుకే లేటైనా పర్వాలేదు కానీ థియేటర్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు ఆలోచన. అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయలంటూ అమెజాన్ తదితర డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ టార్గెట్ చేస్తున్న సినిమాలు.. ఈ డీల్ ని కాదని థియేటర్ రిలీజ్ కి వేళ్తే… ఇక ఆ సినిమాను డిజిటల్ రైట్స్ వాల్యూని అమాంతం తగ్గించేసేందుకు ఓటీటీ వాళ్లు వెనుకంజ వేయడం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ గేమ్ లో నిర్మాతలు బోలెడన్ని చిక్కుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కార్పొరెట్ దెబ్బకు లోకల్ ఓటీటీలు నీరుగారి పోతున్నాయ్.
Please Read Disclaimer