ఆ స్టార్ కపుల్ మళ్లీ పెళ్లి చేసుకున్నారా?

0

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కొన్ని సంవత్సరాల క్రితం భార్య సుజానే ఖాన్ కు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. సుదీర్ఘ వివాహ బంధంకు ఏదో వివాదం కారణంగా వారు ఫుల్ స్టాప్ పెట్టి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తూ వచ్చారు. విడాకులు తీసుకున్న తర్వాత అప్పుడప్పుడు కలుస్తూ ఉండటం వల్ల మళ్లీ ఇద్దరి మద్య ప్రేమ చిగురించిందని.. గొడవలు మర్చి పోయి కలిసి పోయారు అంటూ వార్తలు వచ్చాయి.

గత సంవత్సర కాలంగా వీరిద్దరు తరచు కలిసి బయట తిరగడం.. పిల్లలతో కలిసి విహార యాత్రలకు వెళ్లడం చేస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా పిల్లలతో కలిసి వీరు మంచు కొండల్లో ఎంజాయ్ చేశారు. ఆ ఫొటోలను సుజానే ఖాన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తో పాటు ఇంకా ఇతర కుటుంబ సభ్యులు అంతా కూడా ఈ విహార యాత్ర లో వీరితో పాటు ఉన్నారు. హృతిక్ రోషన్ కుటుంబంతో కలిసి సుజానే ఖాన్ మంచు కొండల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం చర్చకు తెర లేపుతున్నాయి.

విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్ మరియు సుజానే ఖాన్ లు మళ్లీ పెళ్లి చేసుకున్నారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఉండాలనుకుని మళ్లీ రహస్యంగా సాదా సీదాగా పెళ్లి చేసుకుని ఉండవచ్చు అంటూ బాలీవుడ్ వర్గాల వారు కూడా ఊహిస్తున్నారు. పెళ్లి చేసుకోవడం వల్లే హృతిక్ రోషన్ కుటుంబ సభ్యులందరితో కలిసి సుజానే ఖాన్ ఇలా మంచు కొండల్లో విహార యాత్రకు వెళ్లి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పిల్లలకు ఇబ్బంది లేకుండా మళ్లీ వారిద్దరు కలవడం నిజంగా అభినందనీయం.
Please Read Disclaimer