ప్రూవ్ చేసి రియల్ హీరోలవుతారా?

0

టాలీవుడ్లో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ వున్నా టాలెంట్ లేకపోతే నిలబడటం కష్టమే. అందుకు చాలా ఉదాహరణలే వున్నాయి. ఎంత బడా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అది ఎంట్రీ వరకూ.. ఆ తర్వాత కొన్నాళ్లపాటు పెట్టుబడులు పెట్టేందుకు తప్ప ఇక దేనికీ ఉపయోగపడదని ప్రూవైంది. కేవలం ప్రవేశం వరకే బ్యాక్ గ్రౌండ్ .. ఆ తర్వాత ఎవరికి వారే నిరూపించుకుని మార్కెట్ కి డార్లింగ్ అవ్వాలని ఎందరో స్టార్లు బహిరంగ వేదికలపైనే చెప్పారు. ప్రతి సినిమాని మొదటి సినిమాగా భావించి కష్టపడితేనే ఇక్కడ పనవుతుందని అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

అయితే ఎక్కడ తేడా జరిగిందో కానీ.. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఆ ఇద్దరు హీరోల కెరీర్ ఇటీవల ఊహించని డైలమాలో పడిపోవడం ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. సోలో హీరోలుగా చేసిన వాటిలో ఏవో రెండు మూడు సినిమాలు మాత్రమే ఆశించిన స్థాయి విజయాలు అందుకుని మిగతా వాటిలో మెజారిటీ పార్ట్ ఫ్లాపులవ్వడంతో కాలక్రమంలో ఆ ప్రభావం మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపించింది. ఇక సొంత బ్యానర్లలో నిర్మించిన సినిమాలు.. ఫ్యామిలీ మల్టీస్టారర్ సైతం డిజాస్టర్లుగా నిలవడంతో అది కాస్తా కెరీర్ పై బిగ్ పంచ్ వేసింది.

ఒకానొక దశలో ఇక సినిమాలు చేయలేం అని చేతులెత్తేసి అటుపై కొంత గ్యాప్ తీసుకుని కూడా తిరిగి ఏదో ఆశతో కెరీర్ పరంగా కొత్త ప్రయత్నాలు చేస్తుండడం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి ఫేడవుట్ అయ్యి తిరిగి కంబ్యాక్ అవ్వడం అంటే అదో బిగ్ ఛాలెంజ్ లాంటిది. మరి ఆ ఇద్దరు హీరోలు కం బ్రదర్స్ తిరిగి కంబ్యాక్ అవుతారా? దీనిని రియల్ లైఫ్ ఛాలెంజ్ గా భావిస్తున్నారా? రియాలిటీలో దమ్మెంతో చూపించి రియల్ హీరోలు అనిపించుకుంటారా? అంటూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇక ఇప్పటికే ఆ ఇద్దరిలో ఒకరు ఓ బహుభాషా చిత్రంతో జాక్ పాట్ కొట్టాలని పంతంతో ఉంటే.. వేరొక హీరో సొంత బ్యానర్ ప్రారంభించి కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నారు. మరి ఈ ఇద్దరూ ఛాలెంజ్ లో నెగ్గుకొస్తారా? అంత సత్తా ఉందా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home