వారు ఇంత కంటే ముద్దు గా ఉంటారా

0

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా కనిపించడమే లేదు. ఒక వేళ ఇద్దరు ముగ్గురు తెలుగు అమ్మాయిలు ఉన్నా కూడా బి గ్రేడ్ హీరోయిన్స్ గానో లేదంటే సెకండ్ హీరోయిన్స్ గానో ఉంటున్నారు. మహా అయితే చిన్న హీరోల కు జోడీ గా నటిస్తున్నారు తప్ప స్టార్ హీరోల కు జోడీ గా అయితే తెలుగు అమ్మాయిలు నటించిన దాఖలాలు కనిపించడం లేదు. ముంబయి ముద్దు గుమ్మలను మలయాళి అమ్ము కుట్టిలను పంజాబీ అమ్మాయిలనే ఎక్కువ గా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తీసుకుంటున్నారు.

తెలుగు అమ్మాయిలు కూడా ముంబయి ముద్దు గుమ్మలకు ఏమాత్రం తీసి పోకుండా అందాలు ఆర బోయడంతో పాటు మలయాళి ముద్దు గుమ్మల మాదిరిగా క్యూట్ గా ఉంటారు. అయినా కూడా మనోళ్ల కు నచ్చడం లేదంటూ సోషల్ మీడియాలో టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగమ్మాయి అయిన ఇషా రెబ్బా అందంతో పాటు అభినయంతో కూడా అలరిస్తూ ఉంది. కాని ఆమెకు ఆశించిన స్థాయిలో మంచి ఆఫర్లు రావడం లేదు.

ఈ అమ్మడు సోషల్ మీడియా లో తన ఫొటో షూట్స్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది. స్కిన్ షో నుండి పద్దతైన ముద్దు గుమ్మలా ఉందే అనిపించేలా ఫొటోలన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అయినా కూడా ఈషాకు చాన్స్ మాత్రం చాలా చాలా తక్కువే అని చెప్పాలి. ఇటీవల ట్విట్టర్ లో ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఈ ఫొటోల ను చూసిన నెటిజన్స్ ముంబయి ముద్దుగుమ్మలు ఇంతకంటే ఏం అందంగా ఉంటారు. అన్ని విధాలుగా కూడా ఈషా చాలా అందంగా ఉంది కదా ఈమెకు ఎందుకు అవకాశాలు ఇవ్వరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ముందు ముందు అయినా ఈషా కు తెలుగు లో స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
Please Read Disclaimer