సూపర్ స్టార్ లిప్ లాక్ కు మీరు రెడీనా?

0

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి సీజన్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మహేష్ – రష్మికల మధ్య ఒక ఘాటు లిప్ లాక్ సీన్ ఉందని సమాచారం. ఇప్పటికే దర్శకుడు అనిల్ ఈ ముద్దు సన్నివేశం చిత్రీకరణ జరిపారట. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్ ఉందని.. ఆ పాటలో భాగంగా ఈ లిప్ కిస్ సీన్ వస్తుందని అంటున్నారు. లిప్ లాక్ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అనిల్ రావిపూడి టీమ్ ప్రయత్నించారట.. కానీ ఆ విషయం ఎలానో లీక్ అయింది.

మహేష్ సాధారణంగా లిప్ లాక్ సీన్లకు దూరంగా ఉంటారు కానీ ఈమధ్య యూత్ లో ఇలాంటి సన్నివేశాలకు అదరణ దక్కుతుండడంతో పచ్చజెండా ఊపారని సమాచారం. మరోవైపు రష్మికకు హీరోలతో లిప్ లాక్ చేయడం కొత్తేమీ కాదు. ‘గీత గోవిందం’.. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలలో విజయ్ తో రష్మిక లిప్ లాక్ చేసింది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ తో లిప్ లాక్ చేస్తోంది. మరి ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ లిప్ లాక్ పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Please Read Disclaimer