సన్యాసం తీసుకుంటాననుకున్నారా?

0

సౌత్ కాంట్రవర్శీ క్వీన్ అమలాపాల్ కెరీర్ జెట్ స్పీడ్ అందుకున్న సంగతి తెలిసిందే. భర్త విజయ్ నుంచి విడాకుల తర్వాత సినిమాల్లో బిజీ గా ఉంది. ప్రస్తుతం తను కోరకున్న జీవితాన్ని ఆస్వాధిస్తోంది. ఇటీవలే `ఆమె` అనే చిత్రంలో అర్ధనగ్నంగా నటించి సంచలనానికి తెర తీసింది. విడాకుల తర్వాత ఎంతో పరణతి వచ్చిందని…. జీవితమంటే ఛాలెజింగ్ గానే ఉండాలని ఇలాంటి సాహసం చేసినట్లు పబ్లిక్ గానే చెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి తమిళ మీడియా సంధించిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఒకసారి ప్రేమ పెళ్లి విషయంలో కలత చెందారు? వాటిపై మీ అభిప్రాయం ఏమిటి? అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించగా!

ఎవరి జీవితంలోనైనా ఇబ్బందులు సహజం. వాటికి భపపడి పారిపోకూడదనేదాన్ని బలంగా నమ్ముతాను. ప్రేమ.. పెళ్లి చాలా గొప్పవి. ఆ రెండు విషయాల్లో నాకు అనుకూల పరిస్థితులు ఏర్పడలేదు. అలాగని వాటిపై విరక్తి చెందలేదు. ప్రేమ ఎప్పుడు? ఎలా? పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకసారి ఫెయిలయ్యానని సన్యాసం తీసుకుంటాననుకుంటున్నారా? అలాంటిదేమీ లేదు. ఈసారి ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉంటాను. తొందరపడేది లేదు. ప్రస్తుతం సినిమాలతో హ్యాపీగా ఉన్నా. చేతిలో అవకాశాలున్నాయి. వాటి గురించే ఆలోచిస్తున్నాని తెలిపింది.

ఏదేమైనా అమలాపాల్ జీవితం పడి లేచిన కెరటం. స్టార్ డైరెక్టర్ విజయ్ ని పెళ్లాడి…విడాకులు తీసుకుని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అదే పరిశ్రమలో నిలదొక్కుకోవాలని కసిగా ప్రయత్నాలు చేసి సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. సాధారణంగా కెరీర్ లో ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్న వారికి పరిశ్రమ అవకాశాలివ్వదు. అలా అందుకోవాలంటే చాలా కమిట్ మెంట్.. డెడికేషన్ ఉండాలి. ఆ విషయంలో అమలాపాల్ ను మెచ్చుకోవాల్సిందే.
Please Read Disclaimer