ఈ దీపావళిని ‘మామ్’ చూసి ఉంటేనా?

0

ఏ పండగ వచ్చినా సెలబ్రేషన్స్ ఇటు టాలీవుడ్ కంటే అటు బాలీవుడ్ లో పెద్ద రేంజులో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అక్కడ పార్టీలు.. ఫంక్షన్లు అంటూ చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఖాన్ లు.. కపూర్ లు.. దేవగన్ లు.. కిలాడీలు ఈ దీపావళిని ఓ రేంజులో సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

ఇక కపూర్ ఫ్యామిలీ కరణ్ జోహార్ తో కలిసి చేసుకున్న పార్టీ మాత్రం సంథింగ్ స్పెషల్. ఈ పార్టీలో శ్రీదేవి కుమార్తె జాన్వీ సహా కరణ్ జోహార్ .. అర్జున్ కపూర్ తదితరులు ఫుల్ జోష్ లో ఉన్నారని తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది. ముఖ్యంగా అన్నా చెల్లెళ్లు అర్జున్ కపూర్ – జాన్వీ మధ్య అనుబంధానికి సంబంధించిన ఫోటో ఒకటి రివీలైంది. తన సోదరిని అర్జున్ ఎంతో ఆప్యాయంగా చూసుకోవడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

వాస్తవానికి మామ్ శ్రీదేవి జీవించి ఉండగా ఆ ఇద్దరి మధ్యా అంతటి క్లోజ్ నెస్ లేదు. అర్జున్ కపూర్ కి శ్రీదేవి సవతి తల్లి కావడం.. తన తల్లి మోనా కపూర్ కి అన్యాయం చేస్తూ శ్రీదేవిని తన తండ్రి బోనీ పెళ్లాడడం ఇవేవీ అతడికి ఇష్టం లేదు. దాంతో శ్రీదేవిని.. ఆమె వారసులైన జాన్వీ- ఖుషీలను దూరం పెట్టాడని ప్రచారమైంది. ఆ క్రమంలోనే దుబాయ్ లో శ్రీదేవి ఆకస్మిక మరణం వేళ అభిమానుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నిటి తర్వాత కపూర్ ఫ్యామిలీ కుదుట పడడానికే చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు కపూర్ ఫ్యామిలీ అంతా ఒకే గొడుగు కిందికి వచ్చింది. అర్జున్ తన చెల్లెళ్లతో బాగానే ఉంటున్నాడు. జాన్వీ-ఖుషీ ఇద్దరినీ దగ్గరకు రానిస్తున్నాడు. ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. ఇదంతా బాలీవుడ్ మీడియాలో నిరంతరం సాగుతున్న ప్రచారం. జాన్వీతో కలిసి ఈ దీపావళిని సంబరంగా జరుపుకున్నాడు అర్జున్. అన్నాచెల్లెళ్ల ఫోటోని కరణ్ జోహార్ క్లిక్ మనిపించారిలా. గురుడి టైమింగ్ అలా ఉంటుంది మరి!! ఈ సంబరాన్ని పైనుంచి మామ్ చూసే ఉంటారు. అన్నాచెల్లెళ్లను ఇలా చూసి ఎంతో ఎమోషన్ అయ్యి ఉంటుంది మరి.
Please Read Disclaimer