47 ఏజ్ ఆవిడను పెళ్లాడాలని 35 ఏజ్ యంగ్ హీరోపై ఒత్తిడి!

0

బోనీకపూర్ తనయుడు.. బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్(35) పెళ్లి కోసం ఇంటి సభ్యులు పోరు పెడుతున్నారా? అంటే నిజమనే తెలుస్తోంది. బాలీవుడ్ హాటెస్ట్ గాళ్ మలైకా ఆరోరా (47)తో అర్జున్ కపూర్ గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా తన తాజా రిలేషన్ షిప్ ని కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ తో రిలేషన్ లో ఉన్నానని మలైకా అంగీకరించింది.

దీంతో చాలా కాలంగా రహస్యంగా వున్న అర్జున్ కపూర్ మలైకాల బంధం పబ్లిక్ అయిపోయింది. అయితే ఈ ఇద్దరు ప్రేమ పక్షుల మధ్య ఏజ్ డిఫరెన్స్ చాలానే వుంది. ఏజ్ లో చాలా పెద్దదైన మలైకాని అర్జున్ ఎలా వివాహం చేసుకుంటాడని ఇప్పటికే బాలీవుడ్లో చర్చ మొదలైంది. మలైకాని పెళ్లి చేసుకునే విషయంలో అర్జున్ కపూర్ తాజాగా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.

మలైకాని వివాహం చేసుకునే విషయంలో తన కుటుంబ సభ్యులు ప్రెషర్ పెడుతున్నారని అయితే ఫైనల్ గా ఎవరెన్ని చెప్పినా తను మాత్రం తన మనసు చెప్పింది మాత్రమే చేస్తానని స్పష్టం చేస్తున్నాడు. కొన్ని విషయాల్లో ఇద్దరి మధ్య చాలా వ్యత్యాసం వుందని తన ఫ్యామిలీ అభ్యంతరం చెబుతున్నారని అయితే ఈ విషయంలో ఫ్యామిలీ మాటల్ని పట్టించుకునే స్థితిలో తాను లేనని అర్జున్ చెబుతున్నాడు.