విలన్ గా మారేందుకు సిద్దమయిన యంగ్ హీరో

0

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ కెరీర్ ఏమాత్రం ఆశాజనకంగా సాగడం లేదు. ఆయన చేసిన చేస్తున్న సినిమాల విషయంలో ప్రేక్షకులు కాని సినీ జనాలు కాని ఆసక్తి చూపడం లేదు. కెరీర్ ఆరంభంలో హడావుడి చేసిన అర్జున్ కపూర్ ఇప్పుడు మాత్రం ఏ సినిమా చూసినా కూడా అంతంత మాత్రమే అన్నట్లుగా టాక్ దక్కించుకుంటున్నాడు. అవకాశాలే రాకపోవడంతో అర్జున్ కపూర్ కెరీర్ కష్టాల్లో పడ్డట్లయ్యింది. ఆయన ముందు ముందు అయినా నిలదొక్కుకునేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా విలన్ గా నటించేందుకు సిద్దం అయ్యాడు. విలన్ గా నటించి అయినా తన కెరీర్ ను నిలబెట్టుకోవాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు.

మోహిత్ సూరి దర్శకత్వంలో 2014లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘ఏక్ విలన్’ చిత్రంకు సీక్వెల్ రాబోతుంది. అదే దర్శకుడు ప్రస్తుతం ‘దో విలన్’ అనే టైటిల్ తో సినిమాను రూపొందించేందుకు అంతా రెడీ అయ్యాడు. హీరోగా జాన్ అబ్రహం నటించబోతుండగా దిశా పటానీ మరియు తారా సుతారియా లీడ్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ విలన్గా కనిపిస్తాడని బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం అర్జున్ కపూర్ కెరీర్ ఉన్న పరిస్థితుల్లో విలన్ గా నటించేందుకు ముందుకు రావడం మంచి నిర్ణయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన కెరీర్ లో మళ్లీ హీరోగా నిలదొక్కుకుంటాడని కపూర్ ఫ్యామిలీ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు. మరి దో విలన్ లో అయినా అర్జున్ కపూర్ ఆకట్టుకుంటాడో చూడాలి.