మలైకాని అలా ఆటపట్టించాడు గురుడు

0

మలైకా అరోరా ఖాన్ – అర్జున్ కపూర్ ప్రేమాయణం గురించి తెలిసిందే. ఏడాది కాలంగా ఈ ప్రేమ జంటపై బాలీవుడ్ మీడియా అలుపన్నదే లేకుండా కథనాలు వండి వారుస్తోంది. మలైకా.. అర్జున్ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్స్ వేళ ఆ ఇద్దరి వెంటా పడడం మీడియాకు అలవాటు వ్యాపకంగా మారింది. ప్రతి బర్త్ డే కి ఈ జంట విదేశీ సెలబ్రేషన్స్ పేరుతో ఒంటరి దీవులకు.. సుదూర తీరాలకు వెళ్లిపోవడం చూస్తున్నదే.

ఈసారి అర్జున్ కపూర్ బర్త్ డే వేడుకల కోసం న్యూయార్క్ వెళ్లాడు. అక్కడికి ప్రియురాలు మలైకా స్పెషల్ అతిధిగా విచ్చేయడం ఆ జంట హ్యాపీ మూవ్ మెంట్స్ ని క్యాప్చర్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడం ఇదంతా ఒక ఆటవిడుపులానే భావిస్తున్నారు ఫ్యాన్స్. మలైకా – అర్జున్ మధ్య ప్రేమకు ఇవిగో ఈ ఫోటోలే సాక్ష్యం. ఆ ఇద్దరి బంధం మరో లెవల్ కి చేరుకుంది! అంటూ ఒకటే జోరైన కథనాలతో హోరెత్తించేస్తోంది మీడియా.

ఈ వెంపర్లాటకు తగ్గట్టే మలైకా- అర్జున్ కపూర్ సైతం టీజింగ్ యాక్టివిటీస్ తో వేడెక్కించడం ఆసక్తికరం. ఈసారి విదేశీ వెకేషన్ నుంచి మలైకాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి రిలీజయ్యాయి. “ఇంతకీ ఈ ఫోటోల్ని తీసింది ఎవరు?“ అంటూ అర్జున్ కపూర్ మావయ్య సంజయ్ కపూర్ మలైకాను సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయడం..దానికి రిప్లయ్ గా “అవును.. ఎవరై ఉంటారు? ప్రార్థిస్తున్నా చెప్పవా?“ అంటూ అర్జున్ సైతం మలైకాని టీజ్ చేయడం ఇదంతా ఓ సరదా వ్యాపకంలా ఉన్నా.. ఆ ప్రేమ జంటకు కపూర్ ఫ్యామిలీ గ్రాండ్ వెల్ కం చెబుతోందని స్పష్టమవుతోంది.

ఆసక్తికరంగా ఈసారి అమెరికా ట్రిప్ లో మలైకాకు అర్జున్ పర్సనల్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించాడట. తనని కెమెరాలో రకరకాల కోణాల్లో బంధించాడట గురుడు. శాంపిల్ కి చిలుకాకుపచ్చ గౌనులో మలైకా ఇచ్చిన స్టన్నింగ్ ఫోజును అభిమానులకు షేర్ చేశాడు. మునుముందు తన ఫోటోగ్రఫీ మాయాజాలం నుంచి ఇంకెన్ని జిమ్మిక్కుల్ని చూపిస్తాడో? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారంతా. అర్జున్ బర్త్ డే సందర్భంగా మలైకా అతడికి ఎంతో ప్రేమగా విషెస్ ని అందించింది. “హ్యాపీ బర్త్ డే మై క్రేజీ.. ఆపతరం కాని ఎక్స్ ట్రీమ్ ఫన్నీ అండ్ అమేజింగ్ అర్జున్ కపూర్.. అన్నివేళలా ప్రేమ.. సంతోషమే నీతో“ అంటూ ఆరాధనా భావాన్ని వ్యక్తం చేసింది.
Please Read Disclaimer