బాలీవుడ్ సెలబ్రిటీ జంటకు కోర్టు విడాకులు ఇచ్చేసింది!

0

ఇటీవల కాలంలో బాలీవుడ్ లోని పలువురు నటీనటులు.. సెలబ్రిటీలు తరచూ విడాకులు తీసుకోవటం ఈ మధ్యన ఎక్కువ అవుతున్న సంగతి తెలిసింతే. తాజాగా ఆ జాబితాలోకి అధికారికంగా చేరారు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అతని సతీమణికి కమ్ మాజీ సూపర్ మోడల్ మెహర్ జెసియాలకు అధికారికంగా విడాకులు మంజూరు చేస్తూ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది.

వాస్తవానికి 2018లోనే ఈ జంట తాము విడిపోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా కోర్టు నుంచి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్లే తాజాగా వారికి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు వెల్లడించింది.

తమ ఇరవైఏళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన గురుతులు ఉన్నాయని.. తామిప్పుడు వేర్వేరు దారుల్లో ప్రయాణించాలని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కొత్త జీవితాన్ని ఆరంభించాలని భావిస్తున్నామని.. పరస్పర అంగీకారంతోనే తాము విడాకులు తీసుకుంటున్నట్లు గతంలో చెప్పారు. దీనికి తగ్గట్లే తాజాగా వారికి ముంబయి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. న్యాయమూర్తి శైలజా సావంత్ వీరికి ప్రత్యేక వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేశారు.

ఇదిలా ఉంటే.. వీరిద్దరికి పదిహేడేళ్ల మహిక.. పదమూడేళ్ల మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత అర్జున్ రాంపాల్ దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లాతో సహజీవనం చేస్తున్నారు. ఐపీఎల్ వేడుకల్లో కలిసిన వీరి మధ్య పరిచయం జరగటం.. తర్వాతి రోజుల్లో విడాకులు.. సహజీవనం వరకూ వెళ్లటం గమనార్హం.
Please Read Disclaimer