మెగా మద్దతు కలెక్షన్స్ గా మారలేదా?

0

యువ హీరో నిఖిల్ సిద్దార్థ్ – లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా నవంబర్ 29 న విడుదలయింది. మౌత్ టాక్.. రివ్యూస్ అన్నీ డీసెంట్ గానే ఉన్నాయి. మంచి కలెక్షన్స్ వస్తున్నాయని ట్రేడ్ చెప్తోంది. అయితే నిఖిల్ ఆశించే రేంజ్ సూపర్ హిట్ దక్కే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అంటున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు మెగాస్టార్ చిరంజీవి హాజరైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఈ సినిమా గురించి.. హీరో హీరోయిన్ల గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడడంతో సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ దక్కుతుందని అంచనాలు వెలువడ్డాయి. అయితే ‘అర్జున్ సురవరం’ కలెక్షన్స్.. రెస్పాన్స్ చూస్తుంటే నిఖిల్ సినిమాలకు ఎప్పుడూ వచ్చే రెస్పాన్స్ వచ్చింది కానీ మెగా టచ్ వల్ల కొత్తగా ఒరిగింది ఏమీ లేదనే టాక్ వినిపిస్తోంది. నిఖిల్ సినిమాలు డిఫరెంట్ గా ఉంటాయని.. కొత్తదనం ఉండేలా చూసుకుంటాడని పేరు. దీంతో నిఖిల్ సినిమాకు మినిమం ఒపెనింగ్స్ ఉంటాయి. పైగా ఒక తమిళ హిట్ కు ఈ సినిమా రీమేక్ కాబట్టి ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి కూడా ఉంది. అంతే కానీ మెగా ఫ్యాన్స్ సపోర్ట్ పెద్దగా దక్కినట్టు లేదని అంటున్నారు.

ఏదైతేనేం.. నిఖిల్ సినిమాకు మెగా మద్దతు ప్రకటించినా బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. బ్లాక్ బస్టర్ కోసం నిఖిల్ మరికొంత కాలం వేచి చూడక తప్పేలా లేదు. ఫుల్ రన్ తర్వాతే ‘అర్జున్ సురవరం’ ఏమాత్రం హిట్ అనే సంగతి తెలుస్తుంది.
Please Read Disclaimer