ఉగ్రరూపం చుపిస్తామంటున్న బాహుబలి నిర్మాతలు

0

ఆర్కా మీడియా అంటే బాహుబలి బాహుబలి-2 సినిమాలు గుర్తొస్తాయి. అలాంటి గొప్ప రికార్డులను నెలకొల్పిన ప్రొడక్షన్ హౌస్.. గుట్టుచప్పుడు కాకుండా “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” అనే సినిమాను తెలుగులో రూపొందిస్తుంది. ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా దర్శకుడు వెంకటేష్ మహా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. బాహుబలి లాంటి గొప్ప సినిమాను తీసిన ఆర్కా మీడియా చాలా గ్యాప్ తీసుకొని జాగ్రత్తగా రూపొందిస్తున్నారు.

టీజర్ – లిరికల్ సాంగ్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. గుట్టుచప్పుడు కాకుండా తెరకెక్కిస్తున్న ఈ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమా గురించి ఎక్కడా ప్రచారాలు కూడా కన్పించట్లేదు. అయితే నిర్మాతలు ఈ సినిమాను సొంతంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. విషయం ఏంటంటే.. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్టార్లు ఎవరు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ అంటున్నారు సినీ విశ్లేషకులు. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను చూడడానికి ప్రేక్షకులు కేవలం ఆర్కా మీడియా బ్యానర్ చూసి రావాల్సి ఉంటుందని.. మరి ఈ సినిమా విషయంలో ప్రేక్షకాదరణ ఎలా ఉండబోతుందో అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-