గాడిదను పెంచుకుంటున్న సూపర్ స్టార్…!

0

హాలీవుడ్ యాక్షన్ హీరో ఆర్నాల్డ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘టెర్మినేటర్’ ‘ప్రిడేటర్’ ‘కమాండో’ చిత్రాలు తెలుగులో కూడా డబ్ కాబడి ఇక్కడ కూడా ఆదరణ పొందాయి. ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ ప్రస్తుత వయస్సు 72. ఈ వయసులో కూడా కండలు తిరిగిన దేహంతో యాక్షన్ హీరోగా నటిస్తూ అదరగొడుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన ఆర్నాల్డ్ వర్కౌట్స్ చేయడం మాత్రం మానలేదు. డైలీ జిమ్ లో కసరత్తులు చేస్తూ తన ఫిజిక్ కాపాడుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటున్నారు. ఆర్నాల్డ్ తమ కుంటుంబానికి సంబంధించిన అన్ని విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల తన కూతురు తల్లి కాబోతుందని.. క్యాథెరీన్ తల్లి కోబోతున్న విషయం నాకెంతో ఎగ్జైటింగా ఉందని చెప్పుకున్నారు ఆర్నాల్డ్. ఇలా తన విషయాలు ఫ్యామిలీ విషయాలు కూడా ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలో తాజాగా ఆర్నాల్డ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియో షేర్ చేసారు. అయితే ఈ వీడియోలో తనతో పాటు ఆయన తన పెంపుడు గాడిద లులుతో కలిసి కసరత్తులు చేశారు ఆర్నాల్డ్. ”లులు కసరత్తులు చేస్తోంది” అని కాప్షన్ పెట్టారు. ఆ వీడియోలో ఆర్నాల్డ్ తో పాటు హోమ్ జిమ్ లో అడుగు పెట్టిన ‘లులు’ ఆయన చేస్తున్న పనిని ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉండిపోయింది. జిమ్ మొత్తం తిరుగుతూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. అందరూ పెట్ డాగ్స్ ని.. పిల్లులని.. బర్డ్స్ ని పెంచుకుంటుంటే మన హాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం గాడిద ని పెంచుకుంటున్నాడు. కాగా ఆస్ట్రేలియన్ – అమెరికన్ స్టార్ యాక్టర్ అయిన ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ గతంలో కాలిఫోర్నియాకు గవర్నర్ గా కూడా వ్యవహరించారు.

 

View this post on Instagram

 

Lulu pumps up.

A post shared by Arnold Schwarzenegger (@schwarzenegger) on
Please Read Disclaimer