అలా వెళ్లినంత మాత్రాన ఛాన్స్ లు రావు

0

బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఎక్కడైనా కూడా హీరోయిన్స్ కు క్రేజ్ ఉన్నప్పుడు మాత్రమే ఆఫర్లు వస్తాయి. ఒక్కరు ఇద్దరు హీరోయిన్స్ మాత్రం క్రేజ్ లేకున్నా కూడా అడ్డ దారుల్లో అవకాశాలు దక్కించుకుంటారంటూ గుసగుసలు వస్తూ ఉంటాయి. టాలీవుడ్ లో సినిమాలకు సంబంధించిన ఒప్పంద విషయాలను మేనేజర్లు చూస్తారు. కాని బాలీవుడ్ లో మాత్రం పార్టీల కు తిరుగుతూ ఎప్పుడు బాలీవుడ్ ప్రముఖుల దృష్టి లో ఉంటేనే అవకాశాలు వస్తాయంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది.

అవకాశాలు కావాలంటే పార్టీల కు వెళ్లాల్సిందే.. నిర్మాతలు ప్రొడక్షన్ టీం కోరినప్పుడు ఎక్కడికంటే అక్కడకు వెళ్లాల్సిందేనా అంటూ ఆమెను ప్రశ్నించగా అవకాశాలు కావాలంటే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాని అలా చేయడం వల్ల అవకాశాలు వస్తాయని నేను అనుకోను అంది. ఈమద్య కాలంలో ప్రతిభ ఉన్న వారికి మాత్రమే ఆఫర్లు వస్తున్నాయి. కంటెంట్ బేస్ చేసుకుని ఛాన్స్ లు ఇస్తూ ఉంటారు. పార్టీలకు పబ్ లకు తిరిగినంత మాత్రాన ఛాన్స్ లు వచ్చే కాలం పోయిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.

టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో రెండు మూడు సంవత్సరాలు ఒక ఊపు ఊపిన రకుల్ గత కొన్నాళ్లు గా సైలెంట్ అయ్యింది. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. కాని చిన్నా చితకా పాత్రలు తప్ప ఈమెకు మళ్లీ గట్టి మూవీ ఒక్కటి పడటం లేదు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న ఈమెకు మళ్లీ ఆఫర్లు వస్తాయా అనేది చూడాలి.